iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. GHMC అలర్ట్!

  • Published Aug 12, 2024 | 9:01 AM Updated Updated Aug 12, 2024 | 9:01 AM

Heavy Rains: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వర్షం అస్సలు తగ్గేదే లే అంటుంది. మొన్నటి నుంచి తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. అనూహ్యంగా వాతావరణంలో మార్పు రావడంతో అర్థరాత్రి నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి.

Heavy Rains: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వర్షం అస్సలు తగ్గేదే లే అంటుంది. మొన్నటి నుంచి తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. అనూహ్యంగా వాతావరణంలో మార్పు రావడంతో అర్థరాత్రి నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. GHMC అలర్ట్!

గత నెల నుంచి దేశంలో పలు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాలు కారణంగా జలాశయాలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.  ఆదివారం హైదరాబాద్‌లో ఎండలు మండిపోయాయి. నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం అర్థరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి కమ్మేసింది. దీని ప్రభావంతో వాతావరణంలో మార్పు సంభవించి సోమవారం తెల్లవారుజామున నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.. రోడ్లన్నీ వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు నానా తంటాలు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీలో తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చిరుజల్లు పడుతూనే ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, లక్డీకపూల్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, పటాన్ చెరు, యూసుఫ్ గూడ, మియాపూర్, ముసాపేట్, కూకట్ పల్లి, భరత్ నగర్, బాలానగర్, బోయినపల్లి, ప్యారడైజ్, సికింద్రాబాద్, నాచారం, బోడుప్పల్, ఉప్పల్, రామాంతపూర్, కుషాయిగూడ, చంగిచర్ల, నాగోల్, నారపల్లి, దిల్‌సుఖ్ నగర్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి, హస్తినాపురం పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు నీటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

heavy rain in hyderabad

వర్షం భారీగా కురుస్తున్న కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది. నగర వాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలని.. నాలలు ఉన్న ఏరియాల్లో జాగ్రతలు పాటించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, ములుగు, భూపాల్ పల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.