Uppula Naresh
Uppula Naresh
హైదరాబాద్ లో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. దీని కారణంగా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గురువారం ఉదయం బెగంపేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక పక్కా వర్షం, మరో పక్కా ట్రాఫిక్ తో ప్రయాణికులు ఎటూ వెళ్లలేని పరిస్థితిలో అక్కడే ఉండిపోయారు.
ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం నగరంలోని ఐకియా ఫ్లై ఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీని కారణంగా వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచి పోయాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. దీనికి సంబధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారింది. అధికారులు సైతం స్పందించి ప్రజలు అత్యవసరమైతేనే తప్పా ఇంటి నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్: రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు!
Traffic in hyd!! Please ensure you #wfh if possibile in the coming couple of days.#HyderabadRains #ikea @HYDTP @HiHyderabad @KTRBRS pic.twitter.com/XmOTkF2Bi7
— Preetham Tekumalla (@PreethamTekuma2) July 20, 2023