iDreamPost
android-app
ios-app

Sooryavanshi : టాక్ తేడాగా ఉన్నా వసూళ్లు ఘనంగా వచ్చాయి

  • Published Nov 11, 2021 | 10:30 AM Updated Updated Nov 11, 2021 | 10:30 AM
Sooryavanshi : టాక్ తేడాగా ఉన్నా వసూళ్లు ఘనంగా వచ్చాయి

ఏడాదిన్నరగా లాక్ డౌన్ వల్ల స్మశాన నిశ్దబ్దం ఆవహించిన బాలీవుడ్ బాక్సాఫీస్ కు సూర్యవన్షీ ఊపిరిలూదుతోంది. వారం తిరక్కుండానే 100 కోట్ల వసూళ్లను క్రాస్ చేసి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. టాక్ మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో లేకపోయినా సినిమాలో ఉన్న గ్రాండియర్ కి, మల్టీ స్టారర్ లుక్ కి జనం బాగానే ఆకర్షితులవుతున్నారు. బుక్ మై షో యాప్ లో సగటున ప్రతి సెకనుకు 17 టికెట్లు అమ్ముడుపోయిన ఏకైక మూవీగా 2021 కొత్త రికార్డు సృష్టించిందని స్వయానా ఆ సంస్థ ప్రతినిధులు చెప్పడం గమనార్హం. ముఖ్యంగా మొదటి రోజు కన్నా మొన్న ఆదివారమే ఎక్కువ కలెక్షన్ రావడం బట్టి చూస్తే అక్షయ్ కుమార్ లక్ష్యం నెరవేరినట్టే

సరైన పోటీ లేకపోవడం కూడా సూర్యవన్షీకి కలిసి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ డీసెంట్ రన్ అందుకోవడానికి కారణం ఇదే. దాంతో పాటుగా రిలీజైన పెద్దన్న, మంచి రోజులు వచ్చాయి, ఎనిమి మూడూ నిరాశ పరచడంతో అర్బన్ ఆడియన్స్ ని సూర్యవన్షీ బుట్టలో వేసుకోగలిగింది. అలా అని ఏపి తెలంగాణలో కంటిన్యూ గా హౌస్ ఫుల్ బోర్డులు పడలేదు కానీ ఉన్నంతలో మంచి లెక్కలు వస్తున్నాయి. ఇక రేపు రాబోయే రాజా విక్రమార్క, పుష్పక విమానం, కురుప్ ల ప్రభావం దీని మీద ఉంటుందని అనుకోవడానికి లేదు. దేనికీ సరైన బజ్ లేదు. అన్నీ మౌత్ టాక్ ని నమ్ముకుని బరిలో దిగుతున్నవే కావడంతో వేచి చూడాలి.

ఫైనల్ రన్ లో సూర్యవన్షీ 200 కోట్ల మార్కు అందుకుంటుందని ట్రేడ్ అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఒకే ట్రెండ్ లేకపోయినా ప్రేక్షకులకు దీని కన్నా బెస్ట్ ఆప్షన్ లేదు కాబట్టి ఇలాగే కొనసాగుతుందని అనుకుంటున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ కాప్ ఎంటర్ టైనర్ మీద విమర్శలు తక్కువేమి కాదు. ముంబై మీడియా సాఫ్ట్ కార్నర్ తో రివ్యూలను బాగానే మోసినప్పటికీ సాధారణ ప్రేక్షకులు మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే కామెంట్లు చేశారు. ఏదైతేనేం సూర్యవన్షీ ఒక నమ్మకాన్ని ఇచ్చింది. రాబోయే పాన్ ఇండియా సినిమాలకు వసూళ్ల పరంగా ఒక ధైర్యాన్ని కలిగించింది. దాని కొనసాగించే చిత్రాలు రావడమే ఆలస్యం. ప్రేక్షకులు సిద్ధం

Also Read :  God Father : సల్మాన్ తెలుగు ఎంట్రీ ఖాయం