Heads And Tales : హెడ్స్ అండ్ టేల్స్ రిపోర్ట్

గత ఏడాది ఆహాలో వచ్చిన కలర్ ఫోటోతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రాజ్ రచన చేసిన హెడ్స్ అండ్ టేల్స్ ఇవాళ జీ5 యాప్ లో విడుదలయ్యింది. ప్యూర్ ఓటిటి ఫిలింగా ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చారు కాబట్టి దీని మీద థియేట్రికల్ లెవెల్ లో హైప్ లేదు కానీ సునీల్ లాంటి సీనియర్ నటుడు కీలక పాత్ర పోషించడంతో అంతో ఇంతో అంచనాలు ఏర్పడ్డాయి. సుహాస్ కూడా ఇందులో ఒక క్యారెక్టర్ చేశాడు. సాయి కృష్ణ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఫేట్ బేస్డ్ థ్రిల్లర్ నిడివి కేవలం 83 నిముషాలు మాత్రమే ఉండటం విశేషం. మరి ఇంత తక్కువ నిడివిలోనూ హెడ్ అండ్ టేల్స్ ఆకట్టుకునేలా సాగిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

ఇది ముగ్గురమ్మాయిల కథ. తమ జీవితంలో ప్రవేశించిన భాగస్వాములతో సమస్యలు ఎదురుకుంటున్న అలివేలు మంగ(దివ్య శ్రీపాద), శ్రుతి(చాందిని చౌదరి), అనిష(శ్రీవిద్య)ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఏదీ సాఫీగా ఉండదు. విధి ఆడిన నాటకంలో ఒకరికి తెలియకుండా మరొకరు అందులో పావులుగా మారతారు. అసలు వీళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, చివరికి వీళ్ళ ప్రయాణం ఎక్కడికి దారి తీసింది లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా మీద ఓ లుక్ వేయాల్సిందే. గంటన్నర లోపే ముగిసే ఈ అర్బన్ డ్రామాకు సందీప్ రాజ్ ఇచ్చిన పాయింట్ లో కొత్తదనం ఉంది. అయితే ట్రీట్మెంట్ దానికి న్యాయం చేయలేదు. ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు తగ్గట్టు చక్కగా చేశారు. దివ్యశ్రీపాద, శ్రీవిద్య ఎక్కువ మార్కులు కొట్టేశారు. సునీల్ బాగానే కుదిరాడు.

ల్యాగ్ లేకుండా వీలైనంత వేగంగా కథనాన్ని నడిపించాలని ప్రయత్నం చేసిన దర్శకుడు సాయి కృష్ణ దాన్ని పూర్తి స్థాయిలో జస్టిఫై చేయలేదు. టేకాఫ్ బాగా సెట్ చేసుకుని, పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ చక్కగా కుదిరాక సరైన ఎమోషనల్ కనెక్ట్ లేక ఎక్కడిక్కడ హెడ్స్ అండ్ టేల్స్ చప్పగా సాగుతున్న ఫీలింగ్ సాగుతుంది. డ్రామా కూడా ఆశించిన స్థాయిలో పండకపోవడంతో ఫైనల్ గా యావరేజ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. నిడివి ఒకరకంగా ప్లస్ అయినా ఇంకో కోణంలో మైనస్ అయ్యింది. చెప్పాలనుకున్న కథకు షార్ట్ టైం అడ్డంకిగా మారింది. డెప్త్ అండ్ ఎమోషన్స్ విషయంలో ఇంకాస్త గట్టిగా వర్క్ చేసుకుంటే హెడ్స్ అండ్ టేల్స్ బలంగా నిలిచేది

Also Read : OTT Subscription Prices : అలవాటు పడిన వినోదం – పెంచినా భరించాల్సిందే

Show comments