Keerthi
కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీగా శబరిమల తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఇసుకేస్తే రాలనంత రద్దీ ఉండటంతో క్యూ లైన్లలో నిలబడిన ఉన్న అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ నటుడు సునీల్ శబరీమలలో ప్రత్యేక్షమయ్యారు. ఎందుకంటే..
కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీగా శబరిమల తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఇసుకేస్తే రాలనంత రద్దీ ఉండటంతో క్యూ లైన్లలో నిలబడిన ఉన్న అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ నటుడు సునీల్ శబరీమలలో ప్రత్యేక్షమయ్యారు. ఎందుకంటే..
Keerthi
దేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రల్లో ఒకటి శబరిమల. ఇక్కడే మణికంఠ స్వామి కొలువై ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా శబరిమలకు వెళ్తుంటారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల తాడికి బాగా పెరిగిపోయింది. స్వామి వారి దర్శనం కోసం తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో కేరళలో అయ్యప్ప భక్తుల రద్దీ ఇసుకేస్తే రాలనంతగా ఉంది. భక్తులు భారీ సంఖ్యలో రావటంతో అయ్యప్పస్వామి దర్శనానికి చాలా ఆలస్యం అవుతోంది. అందుకోసం అధికారులు, పోలీసులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శబరిమలలో టాలీవుడ్ నటుడు సునీల్ ప్రత్యేక్షమయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
కేరళ అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్న క్రమంలో గంటల తరబడి లైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పాడింది. దీంతో శబరిమలలో క్యూలైన్లు అన్ని రద్దీగా కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ కూడా శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆయన కూడా అయ్యప్ప మాల వేయడంతో ఇరుముడి కోసం అయ్యప్ప క్షేత్రాన్ని వెళ్లారు. సాధారణ వ్యక్తిగా ఎంతో ఓపికగా క్యూలైన్ లో అయ్యప్ప స్వామిని స్మరిస్తూ.. ఆలయంలో ఇరుముడి పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అయ్యప్ప మాలాధార ఉన్న సునీల్ ఇరుముడిని అయ్యప్పకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, శబరిమలలో సునీల్ చూసిన అయ్యప్ప భక్తులు ఆనందన్ని వ్యక్తం చేశారు.
ఇక శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడి ఉన్న అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగు నీరు లేకుండా తంటాలు పడుతున్నామని మండిపడ్డారు. ట్రావెన్‌కోర్ బోర్డుపై మండిపడిన భక్తులు త్వరగా దర్శనం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అయితే భక్తుల దృష్ట్యా దేవస్థానం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి దర్శనం కోసం పరిమితి మేరకే భక్తులను అనుమతి ఇస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం ట్రస్ట్ పేర్కొంది. ఈనెల 14న 40వేల మంది భక్తులకు, 15వ తేదిన 50 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం చేసుకోవటానికి అనుమతి ఇచ్చింది. మరి, శబరిమల క్యూలైన్ లో సాధారణ అయ్యప్ప భక్తుడిగా ఉన్న సునీల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.