iDreamPost
ట్రైలర్ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. గ్రాండియర్లకే బాక్సాఫీస్ వద్ద ఆదరణ దక్కుతున్న ట్రెండ్ లో ఇలాంటి బడ్జెట్ చిత్రాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓసారి రిపోర్ట్ చూద్దాం.
ట్రైలర్ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. గ్రాండియర్లకే బాక్సాఫీస్ వద్ద ఆదరణ దక్కుతున్న ట్రెండ్ లో ఇలాంటి బడ్జెట్ చిత్రాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓసారి రిపోర్ట్ చూద్దాం.
iDreamPost
నిన్న పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సినిమా బుజ్జి ఇలా రా. సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, ఆడో రకం ఈడో రకం లాంటి కామెడీ ఎంటర్ టైనర్స్ లో వినోదాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జి నాగేశ్వర్ రెడ్డి కథ స్క్రీన్ ప్లే అందించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇటీవలే టెన్త్ క్లాస్ డైరీస్ తో డైరెక్షన్ డెబ్యూ చేసిన సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి రెండో మూవీ ఇది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన బుజ్జి ఇలారాలో ధన్ రాజ్, సునీల్ ఇద్దరూ చాలా సీరియస్ పాత్రలు చేయడం విశేషం. ట్రైలర్ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. గ్రాండియర్లకే బాక్సాఫీస్ వద్ద ఆదరణ దక్కుతున్న ట్రెండ్ లో ఇలాంటి బడ్జెట్ చిత్రాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓసారి రిపోర్ట్ చూద్దాం.
వరంగల్ లో చిన్నపిల్లల కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు సవాల్ గా మారుతుంది. ఎనిమిదేళ్ల పిల్లలను అపహరించి వాళ్ళ గుండెలను మరోచోటికి రవాణా చేస్తున్నారన్న విస్తుపోయే నిజం ఈ కేసు విచారణ చేస్తున్న సిఐ కేశవనాయుడు(ధన్ రాజ్)కు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా అనుమానం తన మామ(శ్రీకాంత్ అయ్యంగార్)మీదకు వెళ్తుంది. ఈ లోగా కేశవ్ మీద మరో పోలీస్ ఆఫీసర్ ఖయ్యుమ్(సునీల్)దాడికి దిగుతాడు. అసలు ఈ దారుణాలు వెనుక ఉన్నది ఎవరు, ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేశారు, ఖాకీ దుస్తులు వేసుకున్న వాళ్లలోనే హంతకులు ఉన్నారా అనేది సినిమాలోనే చూడాలి. సైకలాజికల్ థ్రిల్లర్ గా బుజ్జి ఇలా రాని తీర్చిదిద్దారు.
ప్రత్యేకంగా ఈ జానర్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్లకు ఓకే అనిపించే ఈ సినిమాలో ట్విస్టులు బాగానే పేర్చుకున్నారు. సెకండ్ హాఫ్ లో సునీల్ ఎంట్రీ అయ్యాక కథనం మరింత వేగంగా పరుగులు పెడుతుంది. అయితే చివరి పావు గంట మితిమీరిన వయొలెన్స్ చూపించడం బాలేదు. ఆరవ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్టిస్టుల్లో ధన్ రాజ్, సునీల్ బెస్ట్ ఇచ్చేయగా చాందిని పెర్ఫార్మన్స్ అందరికంటే టాప్ లో నిలబడుతుంది. కానీ సీన్స్ ని సోసోగా రాసుకోవడం, డ్రామా పాళ్ళు ఎక్కువ కావడం ఇంటెన్సిటీని తగ్గించేశాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గతంలో విన్నట్టే అనిపించినా ఓవరాల్ గా ఓకే. మరీ తక్కువ అంచనాలు పెట్టుకుంటేనే బుజ్జి ఇలా రా యావరేజ్ అనిపిస్తుంది.