iDreamPost
iDreamPost
పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. అందులోనూ ఆయన ఇటీవల చేస్తున్న కమర్షియల్ సినిమాలకు భిన్నంగా గ్రాండియర్ గా నిర్మిస్తున్న సినిమా. అదేంటో పవన్ డైరెక్టర్ క్రిష్ కలసిచేస్తున్న “హరి హర వీర మల్లు” ప్రారంభం నుంచీ అనేక అడ్డంకులు. ఏఎం రత్నం తన స్థాయికి మించి ఖర్చుచేశారు. సినిమాను మూడేళ్ల క్రితమే ప్రకటించారు. షూటింగ్ ప్రారంభమైంది. మధ్యలో కోవిడ్. అప్పుడప్పుడు షూటింగ్, మళ్లీ గ్యాప్. ఈలోగా మధ్యలో కొన్ని సినిమాలు వచ్చి చొరబడ్డాయి. భీమ్లా నాయక్ రిలీజ్ కూడా అయిపోయింది.
పొలిటకల్ హడావిడి మొదలవుతోంది. వపన్ కూడా రాజకీయంగా బిజి. అందుకే ఈయేడాది సినిమా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినప్పుడు, జూలై నాటికి షూటింగ్‌ను పూర్తి చేసుకొంటుందన్నది అందరూ అనుకున్నారు. అదేంటో సినిమా నిర్మాణం మూడు నెలల నుంచి పెద్దగా ముందుకు కదలలేదు. ఈ మధ్యలో చాలా గాసిప్స్. సినిమా క్వాలిటీ మీద పవన్ కు సంతృప్తి లేదన్నది ప్రధానం. దర్శకుడి పద్ధతి పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశతో ఉన్నారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ లు వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఎంతటి కలెక్షన్స్ రాబట్టాయో అందరికీ తెలుసు. అందుకే ఆడియన్స్ మారిన టేస్ట్ లకు అనుగుణంగా, పవన్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలనుకున్నారు. సీన్స్ ను ఇంకా బెటర్ తీర్చిదిద్దమని పవన్ కోరారు. క్రిష్ మాత్రం ఇంకా మార్పులు చేయలేదు. అంతే, పవన్ షూటింగ్ ఆపేశాడు.
రాజకీయంగా పవన్ చాలా యాక్టీవ్ అయిపోతున్నారు. అక్టోబర్ నుంచి ఏపీలో రాజకీయ పర్యటన చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మీదట పవన్ సినిమాలకు అందుబాటులో ఉండటం కష్టం. ఈలోగా హరిహరతోపాటు మరో సినిమాను పూర్తిచేసే ఉద్దేశం హీరోది. కాని పవన్ కళ్యాణ్ కి, డైరెక్టర్ క్రిష్ కు మధ్య పీటముడి పడటంతో సినిమాను పూర్తిగా రద్దు చేయడమో, లేదంటే వాయిదా వేయడమో చేయొచ్చు. ఏం చేసినా మధ్యలో నిర్మాత ఏఎం రత్నం ఆర్ధికంగా బాగా దెబ్బతినేలా ఉన్నారు.