iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్ కు రేపు మహాచిక్కు

  • Published Feb 06, 2020 | 7:37 AM Updated Updated Feb 06, 2020 | 7:37 AM
మూవీ లవర్స్ కు రేపు మహాచిక్కు

సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలేవీ మెప్పించేలా లేవని మూవీ లవర్స్ బాధ పడుతున్న వేళ రేపు తెలుగు, హింది, ఇంగ్లీష్ కలిపి హోల్ సేల్ గా పదికి పైగా క్యులో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం . అందులో టాలీవుడ్ నుంచే 7 రేస్ లో ఉండటం ఈ మధ్యకాలంలో జరగలేదు. అందరి దృష్టి ప్రధానంగా జాను మీద ఉంది. శర్వానంద్ సమంతా ఆన్ స్క్రీన్ లవ్ కెమిస్ట్రీ కోసం జనం ఎదురు చూస్తున్నారు.

నందు హీరోగా సవారి, నరసింహనంది దర్శకత్వంలో రూపొందిన డిగ్రీ కాలేజీ, ముగ్గురు కమెడియన్స్ నటించిన 3 మంకీస్ అందరికి తెలిసిన విషయమే. కాని ఇవి కాకుండా ఇంకొన్ని పోటీలో ఉన్నాయి. రంగం ఫేం జీవా నటించిన తమిళ సేరు ఇక్కడ స్టాలిన్ అందరివాడు పేరుతో డబ్బింగ్ చేశారు. ట్రైలర్ చూసాక ఇది యాక్షన్ లవర్స్ కోసమే అన్నట్టుంది. నీవల్లే నేనున్నా అనే మరో చిన్న సినిమా కూడా రేపటికే షెడ్యూల్ చేశారు. బ్లాక్ బోర్డ్ అనే ఇంకో మూవీ కూడా లిమిటెడ్ రిలీజ్ తో వస్తోంది.

ఇక హిందిలో మలంగ్ చెప్పుకోదగ్గ అంచనాలతో వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి మోహిత్ సూరి దర్శకుడు. ఏక్ విలన్, ఆశికి 2తో తనకంటూ బ్రాండ్ ఏర్పరచుకున్న మోహిత్ మీద ప్రేక్షకులకు మంచి గురి ఉంది. మల్టీ ప్లెక్సులలో స్క్రీన్లు బాగానే ఇస్తున్నారు. ఇక ఇవి కాకుండా హాక్డ్, షికారా, కాంచ్లీ లాంటి ఇంకొన్ని సినిమాలు కూడా రేస్ లో ఉన్నాయి.

ఇవి చాలవన్నట్టు బర్డ్స్ అఫ్ ప్రే, లిటిల్ విమెన్, బాంబ్ షెల్ ఇంగ్లీష్ సినిమాలు దూసుకొస్తున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో హిందీ ఇంగ్లీష్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి స్క్రీన్ల కేటాయింపు ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పటికీ సంక్రాంతి సినిమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మూడు బాషల సినిమాలు చూసే అలవాటున్న వాళ్లకు రేపు ఛాయస్ పెట్టుకోవడం పెద్ద సవాల్ గా మారనుంది. ఇంకో వారంలోనే విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ వస్తోంది కాబట్టి పోటీ అయితే భారీగానే ఉండబోతోంది

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş