iDreamPost
android-app
ios-app

స్టేషన్ కు రండి – బుద్ధ వెంకన్నకు పోలీసుల నోటీసులు

స్టేషన్ కు రండి – బుద్ధ వెంకన్నకు పోలీసుల నోటీసులు

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు గురజాల పోలీసులు సమన్లు జారీ చేశారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇస్తూ మాచర్లలో అల్లర్లకు సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు మంగళవారం గురజాల డీఎస్పీ వద్దకు ఆధారాలతో రావాలని సూచించారు. కాగా టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న మాచర్ల వెళ్ళిన క్రమంలో ఉమ కార్ అక్కడి ఓ అబ్బాయిని ఢీకొని ఆగకుండా వెళ్లడంతో స్థానికులు ఆ వాహనాన్ని ఆపి బుద్ధ, బోండా ఇద్దరిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు.

విజయవాడకు 150 కిమి దూరంలోని మాచర్ల వచ్చిన ఆ ఇద్దరూ స్థానిక ప్రజలను రెచ్చగొట్టారని, అల్లర్లకు ఆజ్యం పోశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దాడికి పాల్పడిన వైసీపీ నేత తుర్క కిషోర్ దాడికి బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే ఈ ఘటనపై సీరియస్ అయిన టీడీపీ నేతలు డీజీపీతో పాటు గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టి, పలువురికి సమన్లు జారీ చేస్తూ స్టేషన్ కు పిలిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకన్నకు సైతం నోటీసులు వచ్చాయని అంటున్నారు.

marsbahis girişjojobet girişjojobet