మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుల మధ్య మొదలైన మాటల యుద్ధంతో.. ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. కొడాలి నాని లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు మాత్రం ప్రస్తుతం ఎక్కడా కనిపించకపోవడం, వినిపించకపోవడంపై చర్చ సాగుతోంది. కొడాలి నానిపై బొండా ఉమా మహేశ్వరరావు ఒంటికాలిపై లేచేవారు. దేవినేని ఉమా, […]
అసలు ఏం జరిగింది. దాడి ఎలా చేశారు.? అప్పుడు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు..? ఆ రోజు ఘటన తాలూకు వివరాలు చెప్పండి. మీపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తాం… అంటూ గుంటూరు జిల్లా పోలీసులు అడుగుతున్నా.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులు మాత్రం ససేమిరా అంటున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని పోలీసులు కోరుతుంటే.. స్టేషన్‌కు మేము రానేరాము, మీపై మాకు నమ్మకంలేదంటూ […]
‘‘ నువ్ చంపుతావుంటే మేము పారిపోవాలా..? ఎవర్ని చంపుతావురా..? రేపు నీ ఊరికే వస్తా. దమ్ముంటే రా. నాయాల. కొ.. లా నిరాయుధులమైన మాపై దాడి చేయడం కాదు. రేపు రా.. చూసుకుందాం’’ ఇవీ మాచర్ల ఘటన జరిగిన రోజు సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు. ఆ రోజు ఇలా అన్న బొండా ఇప్పుడు వాగ్మూలం కోసం పోలీసులు పిలుస్తున్నా సరే మాచర్ల వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఈ […]
మాచర్ల ఘటన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పీడకలలా వెంటాడుతోంది. మాచర్ల పేరు వింటేనే వణికిపోతున్నారు. ఈ నెల 10వ తేదీన మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసమంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వెళ్లారు. అక్కడ జరిగిన ఘర్షణలో కారు అద్దాలు పగిలిపోగా పోలీసుల సహాయంతో వీరు బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. […]
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు గురజాల పోలీసులు సమన్లు జారీ చేశారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇస్తూ మాచర్లలో అల్లర్లకు సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు మంగళవారం గురజాల డీఎస్పీ వద్దకు ఆధారాలతో రావాలని సూచించారు. కాగా టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న మాచర్ల వెళ్ళిన క్రమంలో ఉమ కార్ అక్కడి ఓ అబ్బాయిని ఢీకొని ఆగకుండా వెళ్లడంతో స్థానికులు ఆ వాహనాన్ని ఆపి బుద్ధ, […]
ఏ ఘర్షణలోనైనా దాడి చేసిన వారిదే తప్పు .ఆ ఘర్షణను ప్రేరేపించిన కారణాలు అనేకం ఉండవచ్చు . కానీ దాడి చట్టవ్యతిరేకమే, సమాజ కోణంలో హర్షణీయం కాదు . మూడు రోజుల కిందట మాచర్లలో టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం తప్పు , పార్టీలకు అతీతంగా పౌర సమాజం ఖండించాల్సిన విషయం. ఘటన జరిగిన మరునిమిషం నుంచి నేతలకు అండగా టీడీపీ అధినేత […]
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఫోన్ ట్యాంపిగ్ భయం వెంటాడుతోంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు కోట్లు వ్యవహారం టీడీపీ నేతలను పీడకలలా గుర్తుకువస్తోంది. ఆ ఘటన తర్వాత స్వతహాగా చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా.. విధిలేని పరిస్థితిలో హైదరాబాద్ నుంచి విజయవాడకు హడావుడిగా మకాం మర్చాల్సి వచ్చింది. అప్పటి వరకూ కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచిన చంద్రబాబు ఆ తర్వాత […]
జనరల్ ఎన్నికలు వేరు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. ఈ ఎన్నికల్లో స్థానిక నేతలు పోటీలో ఉంటారు కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. తమ పంచాయతీ, ఎంపీటీసీ పరిధిలో పక్క గ్రామాల వారు పెత్తనం చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. బయట ప్రాంతాల వారు వస్తే ఊరుకుంటారా..? సొంత పార్టీ నేతలు వచ్చినా స్థానిక నేతలు ఒప్పుకోరు. అలాంటిది.. గుంటూరు జిల్లాలో ఓ మూలన ఉన్న మాచర్ల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసమంటూ.. కృష్ణా […]
గుంటూరు జిల్లా మాచర్లలో స్థానిక ఎన్నికలు పర్యవేక్షణకు వెళ్లి దాడికిగురైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కొద్దిసేపటికి క్రితం అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో కలసి వారు మీడియాతో మాట్లాడారు. తమను చంపేందుకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్లాన్ చేశారని బొండా ఉమా ఆరోపించారు. తమకు ప్రాణ హాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై బొండా తీవ్ర వ్యాఖ్యలు […]
తమ పార్టీ వారిని భగవంతుడే కాపాడాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులు ప్రయాణిస్తున్న కారుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన వెంటనే చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారు. అక్కడ ఏమి జరిగింది..? ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో.. ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. లౌడ్ స్పీకర్ పెట్టి బొండా ఉమా, […]