iDreamPost
iDreamPost
ఒకప్పుడు ఇద్దరు జీనియస్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారే. భారీ బడ్జెట్ సినిమాలతో స్టార్ హీరోలతో బాక్సాఫీస్ ని షాక్ చేసినవాళ్ళే. గుణశేఖర్ అండ్ కృష్ణవంశీ. ఈ రెండు పేర్లు ఏ పరిచయం అక్కర్లేదని టాలెంట్ పవర్ హౌస్ లు. కానీ అదంతా గతం. ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. తమదైన మార్కుతో సినిమాలు తీస్తున్నా కూడా మునుపటి మేజిక్ మిస్ అవుతోందనే కామెంట్స్ ఇప్పటికీ మూవీ లవర్స్ లో వినిపిస్తూనే ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ తీస్తున్న సినిమాల వేగం విషయంలో ఇప్పుడు రివర్స్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. గుణశేఖర్ స్పీడ్ గా కృష్ణవంశీ ఎన్నడూ లేనంత నెమ్మదిగా సాగడమే ఆసక్తి రేపుతోంది.
సమంతా ప్రధాన పాత్రలో గుణశేఖర్ తీస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజానికీ వార్త షాక్ కలిగించింది. ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని ఇంత వేగంగా ఎలా తీశారా అని. నల దమయంతుల కథతో రూపొందుతున్న ఈ ఇతిహాస గాధ కోసం పెద్ద పెద్ద సెట్టింగులు కూడా వేశారు. అయినా కూడా ఇంత ఫాస్ట్ గా తీయడం విశేషమే. అల్లు అర్జున్ పాప అర్హ దీంతోనే డెబ్యూ చేస్తోంది. సామ్ ట్వీట్ చేసేదాకా శాకుంతలం పూర్తియిందన్న సంగతి తెలియలేదు. ఇక రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న కృష్ణవంశీ రంగమార్తాండ గురించి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. ఆగిందా లేక పూర్తయ్యిందా అనే క్లారిటీ కూడా రావడం లేదు.
ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ లో మరాఠిలో వచ్చిన నటసామ్రాట్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా భారీగానే సెట్ చేసుకున్నారు. కృష్ణవంశీ సతీమణి కం హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఒక క్యారెక్టర్ చేశారు. బ్రహ్మానందం, అనసూయ లాంటి తారాగణం ఉన్నారు. కానీ లాభం లేకుండా పోయింది. అసలు ఏం జరుగుతోందో బయటికి చెప్పడం లేదు. మరోవైపు అన్నం అనే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన కృష్ణవంశీ దాని తాలూకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. గుణశేఖర్ తన శైలికి భిన్నంగా వేగంగా సాగుతుందట కృష్ణవంశీ ఇలా నెమ్మదిగా సాగడం సినిమా ప్రేమికులకు అంతుచిక్కడం లేదు
Also Read : చిన్న సినిమాల భారీ యుద్ధం