iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని పాప.. ఇప్పుడు సెన్సేషనల్ హీరోయిన్

  • Published Nov 08, 2023 | 3:16 PM Updated Updated Nov 08, 2023 | 3:16 PM

హీరోనే కాదూ ఉమెన్ పాత్రను హైలెట్ చేస్తూ సినిమాలు వస్తున్నాయి. దీంతో తమను తాము నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది హీరోయిన్లకు. ఇదిగో ఈ పిక్ లో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్ గా మారి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

హీరోనే కాదూ ఉమెన్ పాత్రను హైలెట్ చేస్తూ సినిమాలు వస్తున్నాయి. దీంతో తమను తాము నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది హీరోయిన్లకు. ఇదిగో ఈ పిక్ లో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్ గా మారి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

  • Published Nov 08, 2023 | 3:16 PMUpdated Nov 08, 2023 | 3:16 PM
ఈ ఫోటోలోని పాప.. ఇప్పుడు సెన్సేషనల్ హీరోయిన్

ప్రేక్షకుడు సినిమా చూసే విధానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కోట్లు పెట్టిన సినిమాను కూడా ఒక్క రోజే థియేటర్లలో నుండి పంపేస్తున్నారు. చిన్న సినిమాను తలపై పెట్టుకుంటున్నారు. అలాగే అది ఏ లాంగ్వేజ్ మూవీ అనేది చూడటం లేదు. కొరియన్ డ్రామాలను కూడా ఆస్వాదిస్తున్నారు. అలాగే ఉమెన్ పాత్రను హైలెట్ చేస్తూ మూవీస్ రూపొందిస్తున్నారు న్యూ డైరెక్టర్స్. కథ బాగుంటే.. స్టార్ హీరోయినే అవసరం లేదు. ఆ పాత్రకు న్యాయం చేస్తుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు కలిగితే చాలు.. ఇప్పుడిప్పుడే గ్రోత్ ఉన్న నటిని కూడా తీసుకుంటారు. ఇటీవల అలా ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీ. చిన్న సినిమాలతోనే అలరిస్తూ.. ఇప్పుడు పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఈ పిక్‌ను చూశారా.. ఎంత బాగుందో కదా. గతంలో ఆడ పిల్ల ఇంట్లో ఉందనగానే.. అలా పూల జడ వేసి.. ఫోటో తీసేవారు. బ్లాక్ అండ్ వైట్ డ్రస్సులో, పూల జడ వేసుకుని చక్కగా స్టిల్ ఇస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు నటిగా మారింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా మన తెలుగింటి ఆడ పడుచు కామాక్షి భాస్కర్ల. ఇలా అంటే గుర్తుపట్టలేరు కానీ పొలి మేర మూవీలో సత్యం రాజేష్ భార్య అంటే ఠక్కున గుర్తుపడతారు. ఈ ఫోటో నవ్వి, నవ్వనట్లు కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఆ నటినే. పక్కా తెలుగు అమ్మాయి అయిన కామాక్షి.. డాక్టర్ విద్యను అభ్యసించింది. కొన్ని రోజులు అపోలో ఆసుప్రతిలో వైద్యురాలిగా సేవలు అందించింది. అయితే ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది.

2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది ఈ అమ్మడు. అదే ఏడాది జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్స్ వరకు చేరుకుంది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ లో మెరిసింది. యూ నెవ్వర్ నో అనే పొట్టి సినిమాలో మెరిసింది. ప్రియురాలు అనే సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టిన ఆమె.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో కనిపించింది. ఆమెకు పేరు తెచ్చింది మాత్రం పొలిమేర. ఆ సినిమాలో లక్ష్మి అనే పాత్రలో మెప్పించింది. రౌడీ బాయ్స్, మారేడు మిల్లి ప్రజానీకం, విరూపాక్షలో నటించింది. అయితే ఆమె మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చింది పొలిమేర 2తో. ఆమె నటనకు మరిన్ని ప్రశంసలు వచ్చాయి. అలాగే ఝాన్సీ, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌లో తన దైన నటనతో అలరించింది ఈ భామ.

ఎక్కువగా డీ గ్లామరైజ్డ్ పాత్రల్లోనే మెప్పించడం గమనార్హం. కామాక్షి కేవలం డాక్టర్, నటే కాదూ.. మంచి క్లాసికల్ డ్యాన్సర్ , సింగర్ కూడా. అలాగే ఈ నటిలో సేవా గుణం కూడా చాలా ఎక్కువే. గతంలో పలు ఎన్జీవో సంస్థలతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంది. పర్యటనలు కూడా ఇష్టపడే.. ఆమె ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా అధిరోహించింది. ఇప్పుడు ఓ బిగ్ మూవీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి సినిమా. చిరుతో బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభరలో ఆమె కీలక పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom giriş