iDreamPost
android-app
ios-app

Koffee With Karan 7 గీతాగోవిందం రిలేష‌న్ షిప్ లో ఉన్నారా? బాంబు పేల్చిన సారా అలీ ఖాన్

  • Published Jul 15, 2022 | 1:15 PM Updated Updated Jul 15, 2022 | 1:15 PM
Koffee With Karan 7 గీతాగోవిందం రిలేష‌న్ షిప్ లో ఉన్నారా? బాంబు పేల్చిన సారా అలీ ఖాన్

కాఫీ విత్ కరణ్ 7లో సారా అలీ ఖాన్( Sara Ali Khan), లీగర్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మ‌ధ్య అనుబంధం గురించి పెద్ద బాంబు విసిరింది. సెల‌బ్రిటీ గాసిప్ షో, కాఫీ విత్ కరణ్ కు బెస్ట్ ఫ్రెండ్ జాన్వీ కపూర్‌( Janhvi Kapoor)తో క‌ల‌సి వ‌చ్చిన సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ- రష్మికల మ‌ధ్య ఏదో సమ్ థింగ్ ఉంద‌ని ఉప్పందించింది.

బాలీవుడ్ కోరుకొనే ఇద్దరు స్టార్ కిడ్స్, లైగర్ నటుడు విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఫ్యాన్స్ ఆశ్చ‌ర్య‌పోయే సంగ‌తులు చెప్పారు. నిన్న మొన్న‌టిదాకా సారా, విజ‌య్ ల మ‌ధ్య డేటింగ్ న‌డుస్తోంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెప్పాయి. తీరాచూస్తే, అస‌లు నాతోకాదు, ర‌ష్మిక‌తోనే విజ‌య్ కు రిలేష‌న్ షిప్ ఉంద‌ని సారా చెప్పేస‌రికి, అంద‌రూ షాక్.


కాఫీ విత్ కరణ్ సీజన్ 7 (Koffee With Karan 7) రెండో ఎపిసోడ్‌లో సారా, జాన్వి వ‌చ్చారు. ఇద్దరు విజయ్- రష్మిక మందన్నల మ‌ధ్య‌ డేటింగ్ లైఫ్, మ‌రికొన్ని రసవత్తరమైన విష‌యాల‌ను బైట‌పెట్టారు. వీటిని గాసిప్స్ అనుకోవాలేమో! కాఫీ విత్ కరణ్ సీజన్ 7 రాబోయే ఎపిసోడ్ టీజర్‌ను వదిలి, అభిమానులను షాక్ ఇచ్చారు. కరణ్ షేర్ చేసిన వీడియోలో, సారా- జాన్విలు విజయ్, రష్మికల సంబంధం ఇప్ప‌టిదాకా తెలియ‌ని విష‌యాలను ప‌బ్లిక్ చేశారు.

జాన్వీ, రాపిడ్-ఫైర్ రౌండ్లో, రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు రోజూ పెరుగుతున్నారని చెప్పింది. కాస్త అసూయ ప‌డిన‌ట్లే ఉంది. ఆటైంలో సారా విజయ్ పేరును కొంటెగా ప్ర‌స్తావించింది. గీత గోవిందం జంట‌ రిలేషన్ షిప్ లో ఉందని హిట్ ఇచ్చింది. ఎపిసోడ్‌కు ముందు వర‌కు, సారా-విజయ్ మధ్య ఏదో నడుస్తోందని గ‌ట్టినే పుకార్లు ఉన్నాయి. అంతెందుకు షోలో. కరణ్ డైరెక్ట్ గా అడిగాడు, “సారా, ఈ రోజు మీరు డేటింగ్ చేయాలనుకుంటున్న కుర్రాడి పేరు నాకు చెప్పండి. అప్పుడు సారా చెప్పిన జ‌వాబు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. బాలీవుడ్ కూడా అసూయ‌ప‌డుతున్న పేరు ఇది. అలాంటి సారా, ఇప్పుడు ర‌ష్మిక‌, విజ‌య్ ల మ‌ధ్య రిలేష‌న్ షిప్ ఉందంటే? అది నిజ‌మే అన‌నుకోవాలా!

ఇక సినిమాల విష‌యాల‌కొస్తే, సారా ఇప్పుడు Gaslight తోపాటు, Vicky Kaushal సినిమాలోకూడా న‌టిస్తోంది. ఇక‌ Vijay Deverakonda Ligerలో న‌టిస్తున్నాడు. Ananya Panday హీరోయిన్. బాలీవుడ్ కే అసూయ‌తెప్పిస్తున్న ఈ అంద‌గాడుSamantha Ruth Prabhuతో క‌ల‌సి Kushi చేస్తున్నాడు. Rashmika Mission Majnu, Thank God, Pushpa: The Ruleల‌తో చాలా బిజీ ఉంది. బాలీవుడ్ లో గ‌ట్టిగా నిల‌బ‌డుతోంది.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş