iDreamPost
android-app
ios-app

భారీ వర్షాలు.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్

భారీ వర్షాలు.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్

గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వరుస సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ ను అందించారు. అసలు విషయం ఏంటంటే? ఇంటర్ అడ్మిషన్ల గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ క్రమంలోనే వర్షాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇంటర్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 5 వరకు పొడిగించింది. ఈ పొడిగింపుతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఆగస్టు 5 వరకు అడ్మిషన్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. మరో విషయం ఏంటంటే? ఆగస్టు 6 నుంచి 16 ప్రైవేట్ కాలేజీల్లో చేరే విద్యార్థులు రూ.500 ఫైన్ కట్టి చేరాల్సి ఉంటుందని తెలిపారు. ఇక ఇంటర్ గడువు పెంచడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం!