Idream media
Idream media
కరోనా మహమ్మారికి ఇప్పటి వరకూ మందు లేదు.. లక్షణాలు బట్టి డాక్టర్లు చికిత్స చేస్తూ వస్తున్నారు. జ్వరం ఉంటే జ్వరం మందు… జలుబు ఉంటే సంబంధించినది.. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉంటే దానికి తగిన చికిత్స చేస్తూ.. కరోనా వైరస్ తీవ్రతను మాత్రం తగ్గించ గలుగుతున్నారు. శరీరంలో ఇతర భాగాలకు వ్యాప్తి చెంద కుండా కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న మహమ్మారికి మందు వచ్చింది. గ్లెన్ మార్క్ ఫార్మా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దాని పేరు ఫాబిఫ్లూ టాబ్లెట్. దీనికి డీసీజీఐ ఆమోదం కూడా లభించింది. ముంబాయికి చెందిన గ్లెన్ మార్క్ త్వరలోనే దీన్ని మార్కెట్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీని ధర 103 రూపాయలు గా నిర్ణయించింది.
ఎలా వేసుకోవాలి అంటే..
ఈ మందు ఎలా వాడాలో కూడా ఆ సంస్థ వెల్లడించింది. కరోనా రోగులు 1800 mg tablet తొలి రోజు రెండు సార్లు, ఆ తర్వాత 14 రోజుల పాటు 800 mg tablet రోజుకు రెండు సార్లు తీసుకోవాలని తెలిపింది. బీపీ, షుగర్, గుండె జబ్బులూ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చనీ కూడా పేర్కొంది. అయితే… డాక్టర్ల ప్రిస్కిప్షన్ తప్పని సరి. తమ సంస్థ కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకుని త్వరలోనే మార్కెట్ లోకి తెస్తామని గ్లెన్‌మార్క్ ఛైర్మన్ గ్లెన్ సల్దహ తెలిపారు. రోగుల పై దీన్ని ప్రయోగించి నప్పుడు సత్ఫలితాలు వచ్చాయని వివరించారు.
ఇది అందుబాటులోకి వస్తె కరోనా బారిన పడ్డ బాధితులకు కాస్త ఉప శమనమే అని చెప్పొచ్చు. నేరుగా వైరస్ పై ప్రభావం చూపే మందు వస్తె రోగులు త్వరగా రికవరీ అవుతారు. మరణాల శాతం కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే కరోనా బారిన పడకుండా మాత్రం ప్రస్తుతానికి ఏ మందూ లేదని ప్రజలు గుర్తించాలి. స్వీయ రక్షణ మాత్రమే కరోనా బారిన పడకుండా కాపాడుతుందని మరిచిపోవద్దు. జన సమూహానికి దూరంగా ఉంటే.. కరోనాకు దూరంగా ఉన్నట్లే.