అర్థరాత్రి అమ్మాయి లిఫ్ట్‌ అడిగిందని కారు ఆపారు.. పాపం!

రోడ్లపై వెళుతున్నపుడు.. మనం వెళ్లాల్సిన చోటు చాలా దూరంగా ఉందనుకోండి.. నడిచి వెళ్లలేనపుడు లిఫ్ట్‌ అడగటం చేస్తూ ఉంటాము. రాత్రిళ్లు ఎలాంటి వాహనాలు దొరకనపుడు ఆ దారిలో పోయే వాహనదారులను లిఫ్ట్‌ అడుగుతూ ఉంటాం. లేదా మనమే ఏవరైనా లిఫ్ట్‌ అడిగితే.. వాళ్ల పరిస్థితి చూసి.. లిఫ్ట్‌ ఇవ్వటం చేస్తూ ఉంటాము. అయితే, రాత్రిళ్లు జన సంచారం లేని నిర్మానుష రోడ్లపై లిఫ్ట్‌ ఇవ్వటం అంత మంచిది కాదు. ఈ విషయం మరోసారి రుజువైంది. అర్థరాత్రి.. రద్దీలేని రోడ్డు మీద ఒంటరి అమ్మాయి లిఫ్ట్‌ అడిగిందని ఆ వ్యక్తులు కారు ఆపారు.

అయితే, మంచి చేద్దామనుకున్న వారికి చెడు ఎదురైంది. కొంతమంది ముఠా సభ్యులు ఆ కారును రౌండప్‌ చేసి, దాడికి యత్నించారు. ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో తెలీదు కానీ, ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో ఉన్న దాని ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు మారుతీ స్విఫ్ట్‌ కారులో అర్థరాత్రి వేళ నిర్మానుష రోడ్డుపై వెళుతూ ఉన్నారు. కొంతదూరం పోయిన తర్వాత ఓ అమ్మాయి రోడ్డు పక్క నిలబడి కనిపించింది. ఆమె ఆ కారును చూస్తూ లిఫ్ట్‌ కావాలంటూ చేత్తో సంజ్ఞ చేయటం మొదలుపెట్టింది.

ఇది గమనించిన కారులోని వాళ్లు ఆమె దగ్గర కారు ఆపారు. కారు ఆపగానే యువతి కారు దగ్గరకు వచ్చి.. తన బాధను చెబుతూ ఏడుస్తూ ఉంది. ఆమె మాటలు వారికి సరిగా అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె తీరుపై వారికి అనుమానం కలిగింది. మెల్లగా కారు అద్దాలను క్లోజ్‌ చేశారు. కారు అద్దాలు క్లోజ్‌ అయిన వెంటనే.. అప్పటి వరకు చీకట్లో దాక్కున్న దుండగులు కారును చుట్టుముట్టారు. గట్టిగా అరుస్తూ, రాడ్లతో కారును కొట్టసాగారు. లోపల ఉన్న వారిని బయటకు రమ్మని అరవసాగారు. దీంతో లోపల ఉన్న వారు బిక్కచచ్చిపోయారు. డ్రైవర్‌ ధైర్యం తెచ్చుకుని కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో కథ సుఖాంతం అయింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments