iDreamPost
android-app
ios-app

డబల్ లాభాలొచ్చేశాయి – ఇక ఓటిటికే ?

  • Published Aug 16, 2021 | 9:16 AM Updated Updated Aug 16, 2021 | 9:16 AM
డబల్ లాభాలొచ్చేశాయి – ఇక  ఓటిటికే ?

థియేటర్లకు సినిమాలు వదలాలా వద్దా అనే సంశయంలో ఉన్న ఇండస్ట్రీకి తగినంత ఉత్సాహాన్ని ఇచ్చింది ముమ్మాటికీ ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీనే. మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ సైతం షాక్ అవ్వడం అబద్దం కాదు. నాలుగున్నర కోట్ల దాకా బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఆల్రెడీ ఆరు కోట్లకు పైగా షేర్ రాబట్టి దాదాపు రెట్టింపు లాభం వైపు దూసుకుపోతోంది. పాగల్ లాంటి కొత్త చిత్రాలు వచ్చిన నేపథ్యంలో ఎస్ఆర్ కళ్యాణమండపం ఇప్పటికే స్లో అయ్యింది. ముఖ్యంగా వీక్ డేస్ లో వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. అందుకే ఇప్పుడు ఓటిటి వైపు వెళ్లేందుకు రంగం సిద్ధమయ్యిందని సమాచారం.

తాజాగా అందించిన సమాచారం మేరకు ఈ నెల 27న ఎస్ఆర్ కళ్యాణ మండపం డిజిటల్ ప్రీమియర్ ఉండొచ్చని టాక్. ఆహా యాప్ దీని హక్కులను కొన్న సంగతి తెలిసిందే. ఒప్పందం చేసుకునే టైంలోనే మూడు వారాల వ్యవధి అని ముందే మాట్లాడుకున్నారట. అంటే సరిగ్గా 21 రోజులకు స్మార్ట్ స్క్రీన్ పై సినిమా వచ్చేసినట్టన్న మాట. ఇందులో తప్పు బట్టడానికి ఏమి లేదు. థియేట్రికల్ నుంచి ఇంతకన్నా ఆశించడానికి ఏమి లేదు. పైగా వారానికి అయిదారు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాంగ్ రన్ ఆశించడం అత్యాశే. అందుకే త్వరగా దీన్ని హోమ్ ఎంటర్ టైన్మెంట్ లో తీసుకురాబోతున్నారు.

ఇదింకా అఫీషియల్ ప్రకటనగా రాలేదు. అయినా క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ నే పాతిక రోజులకు స్ట్రీమ్ చేసిన ఆహా దీనికి ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకోవడం కష్టమే. ఎస్ఆర్ కళ్యాణ మండపం సక్సెస్ దెబ్బకు హీరో కిరణ్ అబ్బవరం డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. రెండు కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ అదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. మరో మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్న కిరణ్ కోసం ఇంకో మూడు ప్రాజెక్టులు వెయిటింగ్ లో ఉన్నాయి. మొత్తానికి ఆగష్టు లోనే టాప్ హిట్ గా నిలిచిన ఎస్ఆర్ కళ్యాణ మండపం త్వరలో మీ ఇంట్లోనే చూసుకోవచ్చు

Also Read : కొత్త కలయికతో అరవ హీరో

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet