రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం చాలా హాట్ హాట్ గా ఉంది. ఏపీ కంటే కొన్నినెలల ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఇక్కడ పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. అధికార బీఆర్ఎస్.. మరోసారి గెలవడం కోసం చూస్తుంటే.. ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల్లోని అసమ్మత్తులపై ఇతర పార్టీల వారు కన్నేస్తున్నారు. అలానే చాలా మంది అసమ్మత్తులు తమ పార్టీలను వదలి.. ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో జంపింగ్ లు కొనసాగుతున్నాయి. మండల స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ తమకు అనువైన పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది వివిధ పార్టీల్లో చేరారు. తాజాగా భారత్ రాష్ట్ర సమితి పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఓ జడ్పీ ఛైర్ పర్సన్.. రాజీనామా చేశారు. గద్వాల జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్ఠానానికి పంపించినట్లు సరిత తెలిపారు. దిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో గురువారం సరిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరతారని టాక్ వినిపిస్తోంది. గతంలో జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ కూడా స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ తన పదవికి రాజీనామా చేసింది.
ఇదీ చదవండి: సర్కార్ సంచలన నిర్ణయం.. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో చేపల కూర?