iDreamPost
iDreamPost
సంక్రాంతి వచ్చేస్తోంది. సినిమా సంబరాలకు మూవీ లవర్స్ రెడీ అవుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఉండే ఉత్సాహం మాత్రం ఈసారి అంత స్థాయిలో లేదు. కారణం ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల వాయిదానే. నాగార్జున బంగార్రాజు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదన్న మాట వాస్తవం. ఇక 14న ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడుతున్నా కూడా కిక్ మాత్రం తక్కువే అనే చెప్పాలి. నాగార్జున రేస్ లో ఉన్నా కూడా మరికొన్ని మీడియం బడ్జెట్ మూవీస్ కూడా సై అంటూ సవాల్ విసురుతూ ఉండటం గమనార్హం. ఎన్ని వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి ఛాయస్ మాత్రం బంగార్రాజు అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
దిల్ రాజు నిర్మాతగా ఆయన సోదరుడి కుమారుడు ఆశిష్ ని పరిచయం చేస్తూ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తీసిన రౌడీ బాయ్స్ మెల్లగా బజ్ పెంచుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే సినిమా యూత్ ని టార్గెట్ చేసినట్టు క్లియర్ గా అర్థమైపోయింది. తారక్ చెప్పినట్టు ఇందులో నిజంగానే ప్రేమ దేశం షేడ్స్ చాలా కనిపిస్తున్నాయి. మరి మ్యూజిక్, ఎమోషన్స్ అదే స్థాయిలో చూపించారో హిట్ ఖాయమే. కథా కథనాలు ఫ్రెష్ గా ఉంటే చాలు. ఇక సితార బ్యానర్ నుంచి వస్తున్న డీజే టిల్లు మీద పెద్దగా అంచనాలు లేవు కానీ చూశాక సర్ప్రైజ్ ఇస్తుందని నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. 26కి వాయిదా పడొచ్చనే టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు
ఇక జీరో హైప్ తో వస్తున్న మెగా అల్లుడి మూవీ సూపర్ మచ్చి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగుతూ సాగుతూ ఫైనల్ గా సంక్రాంతి రేస్ లోకి వచ్చి నిలబడింది. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రమోషన్లు ఏవీ చేయలేదు. మెగా కాంపౌండ్ నుంచి కూడా దీనికి సంబంధించిన సౌండ్ లేదు. కళ్యాణ్ దేవ్ మూడో సినిమా కిన్నెరసానికి దీనికి కేవలం 12 రోజుల గ్యాప్ మాత్రమే ఉండటం చూస్తే ఏదో అనుమానం రాక మానదు. మొత్తానికి బంగార్రాజు 14న సోలో బ్యాటింగ్ చేయడం ఖాయమే కానీ మిగిలిన మూడు సినిమాలు ఏమైనా స్వీట్ షాక్ ఇస్తాయేమో తెలియాలంటే ఇంకో అయిదు రోజులు ఆగితే తెలుస్తుంది.
Also Read : Venu Sriram : సూపర్ హిట్ తర్వాత కూడా ఇంత గ్యాపా