అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: అంబటి రాయుడు

తనదైన ఆటతీరుతో మైదానంలో.. అదే విధంగా బయట బోలెడంత పాపులారిటీని ఈ తెలుగు కుర్రాడు సంపాదించుకున్నాడు. క్రికెట్ లో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ రాయుడు పెంచుకున్నాడు.  క్రికెట్ గుడ్ బై చెప్పిన ఈ తెలుగు యువకుడు అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి  వస్తానంటూన్నాడు. రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఇప్పటికే రాయుడు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు.

తనదైన ఆటతీరుతో మైదానంలో.. అదే విధంగా బయట బోలెడంత పాపులారిటీని ఈ తెలుగు కుర్రాడు సంపాదించుకున్నాడు. క్రికెట్ లో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ రాయుడు పెంచుకున్నాడు.  క్రికెట్ గుడ్ బై చెప్పిన ఈ తెలుగు యువకుడు అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి  వస్తానంటూన్నాడు. రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఇప్పటికే రాయుడు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు.

టీమిండియా మాజీ క్రికెటర్  అంబటి రాయుడు ఇటీవలే క్రికెట్ కు గుబ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తనదైన ఆటతీరుతో మైదానంలో.. అదే విధంగా బయట బోలెడంత పాపులారిటీని ఈ తెలుగు కుర్రాడు సంపాదించుకున్నాడు. క్రికెట్ లో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ రాయుడు పెంచుకున్నాడు.  క్రికెట్ గుడ్ బై చెప్పిన ఈ తెలుగు యువకుడు అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి  వస్తానంటూన్నాడు. రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఇప్పటికే రాయుడు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. తాజాగా తనకి అవకాశం వస్తే 2024 లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నానని తన మనసులో మాట బయటపెట్టాడు.

ఐపీఎల్ 2023 సీజన్ చివరి మ్యాచ్ రోజే అంబటి రాయుడు క్రికెట్ కి గుడ్ బై  చెప్పాడు. ఆ తర్వాత నుంచి తన సొంత జిల్లా అయినా గుంటూరులోని  పలు గ్రామాల్లో పర్యటించడం ప్రారంభించాడు. స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అలానే తరచూ ప్రభుత్వ పథకాల విషయంపై కూడా రాయుడు స్పందిస్తుంటారు. లేటేస్ట్ గా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. అలానే మంచి పనులు చేస్తున్నప్పుడు బురద చల్లడం సహజమేనని వైసీపీ వ్యతిరేకులకు చురకలాంటించాడు. ఇలా వైసీపీకి పరోక్షంగా అంబటి రాయుడు మద్దతుగా ఉంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.  ఈ క్రమంలోనే తరచూ గ్రామాలను పర్యటిస్తునారు.

తాజాగా గుంటూరు లోని ఆర్ అగ్రహారం లో పర్యటించిన రాయుడు.. స్థానిక ఆటో డ్రైవర్లతో కలిసి టీ తాగారు. అనంతరం వారితో కాసేపు రాయుడు ముచ్చటించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయుడు మాట్లాడుతూ.. అనేక సమస్యలపై తాను అవగాహన తెచ్చుకున్నానని, అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాని తెలిపారు. అయితే రాయుడు రాజకీయ ఎంట్రీ పై హింట్ ఇస్తున్నాడు తప్పితే అధికారికంగా ప్రకటించడం లేదు. మరి.. అంబటి రాయుడు చేసిన తాజాగా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments