Idream media
Idream media
మా అమ్మమ్మ గారి ఊళ్లో 30 కుటుంబాలుండేవి. నా చిన్నప్పుడు ఆ ఊళ్లో నీళ్లుండేవి కావు. ఒకే ఒక చేతి బోరు. ఊళ్లో సహజంగానే గ్రూపులు, తగాదాలు, అసూయ ద్వేషాలుండేవి. కానీ ఎప్పుడైనా ఆ బోరు చెడిపోతే అన్నీ మరిచిపోయి ఊరంతా ఒకటై రిపేరు చేయించేవాళ్లు.
ఆ పల్లెటూరి వాళ్లలో ఉండే వివేకం , విజ్ఞత కూడా మన చంద్రబాబుకి లేదు. కరోనా కష్టం పిడుగులా వచ్చి పడింది. చేయగలిగినంతా జగన్ చేస్తున్నాడు. ఇంత పెద్ద యజ్ఞంలో చిన్నచిన్న పొరపాట్లు, తప్పులు జరుగుతాయి. అది సహజం.
విపత్తు సమయంలో సహకారం మరిచిపోయి చంద్రబాబు , ఆన్‌లైన్ సమావేశంలో ఉచిత సలహాలు ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోని ప్రతి ఊళ్లో కమిటీలున్నాయి, నాయకులున్నారు. వీళ్లంతా ఎక్కడికక్కడ ప్రజలకి , అధికారులకి అండగా ఉండాలి. అది పోయి ఇప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు.
చంద్రబాబు ఇంట్లో నుంచి బయటికి రాకుండా , తెలుగుదేశం నాయకులు ఇళ్లలోనే ఉంటూ , రోడ్డు మీద విధి నిర్వహిస్తున్న అధికారుల్ని , ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. బాబు, ఆయన నాయకులు డబ్బులు లేని వాళ్లేం కాదు.
వీళ్లంతా ప్రజలకి ఏం చేస్తున్నట్టు? ప‌్రజలు కష్టాల్లో ఉన్నారని తెలియదా? బాబుకి ఇప్పటికైనా వివేకం ఉంటే ముందుకొచ్చి జగన్‌కి సహకరించాలి. ఆయన కుమారుడు లోకేశ్ మరీ అధ్వానం. ఆయన ట్విట్టర్ నాయకుడే తప్ప ఇంకేమీ కాడని మళ్లీ రుజువు చేసుకుంటున్నాడు.