అప్పుడు మాటిచ్చారు..
చేసి చూపించారు..!!
తేదీ :30-May-2019, సరిగ్గా ఏడాది.
సమయం : మధ్యాహ్నం 12.23 గంటలకు..
స్థలం : విజయవాడ లోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం.
కార్యక్రమం : నవ్యాంధ్ర ప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
… అనంతరం ప్రజలను ఉద్దేశించి జగన్ ఏం చెప్పారు.. చెప్పినవి ఏడాదిలో కొన్ని అయినా చేశారా..? అని పరిశీలిస్తే.. కొన్ని కాదు.. దాదాపు అన్నీ చేసి ఇంతకు ముందెన్నడూ.. చేయని పాలన సాగించినట్లు ఆయన చేసిన పనులే నిదర్శనం గా కళ్ళముందు కనిపిస్తున్నాయి. ” మీ కష్టాలను నేను చూసాను.. మీ బాధలను నేను విన్నాను.. నేను ఉన్నాను” అంటూ ప్రసంగం మొదలు పెట్టిన జగన్.. అవ్వా తాత ల పింఛను నాలుగేళ్ల 10 నెలల కాలంలో 3000కు పెంచుకుంటూ పోతానని చెప్పి.. జూన్ నెల నుంచి రూ. 2,250తో మొదలు పెడుతున్నట్లు చెప్పి.. వేదిక పైనే తొలి సంతకం పెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 44 లక్షల మందికి రూ.1000 చొప్పున ఇచ్చే పింఛను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. 58.61 లక్షల మందికి రూ.2250 చొప్పున అందిస్తున్నారు. అవ్వా తాత లకు ఇచ్చిన మాట కంటే ఎక్కువ మందికి జగన్ అండగా నిలిచారు.
ఆగస్టు 15 నాటికి.. గ్రామ వాలంటీర్ లను, అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివా లయాలను అందుబాటులోకి తెచ్చి దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే.. చెప్పిన తేదీల్లోగా.. చెప్పినన్ని ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా.. ప్రజల వద్దకు పాలన అందిస్తున్నారు. స్వచ్చమైన పాలన, అవినీతి, వివక్షత లేని పాలన కోసం.. అభివృద్ధి పనుల్లో ఎక్కువ మందిని పాలు పంచుకునేలా చేస్తూ.. రివర్స్ టెండరింగ్ చేస్తామని చెప్పి అవినీతి ప్రాజెక్టు పునాదులను ప్రక్షాళన చేపడుతున్నారు.
పాలనలో నూతన ఒరవడి తెస్తానని చెప్పి.. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రతీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ.. రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీ చూడకుండా అర్హులైన అందరికీ.. అందరూ నా వాళ్ళే అని భావిస్తూ.. ప్రతీ అక్కకు, ప్రతీ చెల్లెమ్మ కు, ప్రతీ అవ్వకు, ప్రతీ తాతకు, ప్రతీ సోదరుడికి, ప్రతీ స్నేహితుడికి.. ఆకాశమంత విజయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ రోజు చెప్పినవే కాకుండా.. అంతకు మించి ప్రజలకు అందిస్తూ.. మాట ఇస్తే చేసి తీరతాడని రుజువు చేసుకుంటున్నారు. మే 30, 2019న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. జూన్ నుంచి 2020 మే 20 వరకూ.. 3, 57, 51, 612 మంది అన్నీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు, రూ. 40, 139 కోట్లు విలువైన లబ్ధి చేకూర్చి… దేశం మొత్తం మీద ఇంత తక్కువ కాలంలో.. ప్రజలకు అంత ఎక్కువ లబ్ధి చేసి ఉండరేమో అనేలా.. ఏడాది లోనే అందరినీ తన వైపు తిప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.