iDreamPost
android-app
ios-app

చైర్మన్ నిర్ణయం సిగ్గుచేటన్న మంత్రి

చైర్మన్ నిర్ణయం సిగ్గుచేటన్న మంత్రి

ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపడాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు బ్లాక్‌ డే కంటే ఘోరమైన రోజు అని వ్యాఖ్యానించారు. చట్టసభలపై గౌరవం లేకుండా టీడీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. బిల్లులను ఓటింగ్‌కు పెట్టకుండా.. టీడీపీ సభ్యులు ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే ముందుగానే మోషన్‌ మూవ్‌ చేయాలని, కానీ ఛైర్మన్‌ అలా చేయకుండా డైరెక్ట్‌గా సెలెక్ట్‌ కమిటీకి పంపారన్నారు. చంద్రబాబు నాయుడు కన్నుసన్నుల్లో ఛైర్మన్‌ వ్యవహరించారని ఆరోపించారు. విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చైర్మన్ చెప్పడం సిగ్గు చేటన్నారు. అందరికీ నీతి నియమాలు చెప్పే యనమల రామకృష్ణుడు.. వికేంద్రీకరణ బిల్లుపై నిబంధనలు పాటించలేదని విమర్శించారు. మండలిలో తమకు ఉన్న సంఖ్యా బలాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి అడ్డుపడిందని మండిపడ్డారు.