పాలమ్మి కోటి రూపాయలతో ఇల్లు.. బాగా సంపాదిస్తున్న రైతు!

పాలమ్మి కోటి రూపాయలతో ఇల్లు.. బాగా సంపాదిస్తున్న రైతు!

మనకు పాలు అనగానే గుర్తుకు వచ్చేది.. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. ఆయన చెప్పిన ఓ  డైలాంగ్ తో పాల వ్యాపారం, ఆయన ఫేమస్ అయ్యారు. పాలమ్మినా, పూలమ్మిన, కష్టపడ్డా అంటూ ఆయన చెప్పే డైలాగ్.. అందరిని ఆకట్టుకుంది. తాను పాలు అమ్మే కోట్ల ఆస్తులు సంపాదించానని ఎన్నో సందర్భాల్లో మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆయన లాగానే పాల వ్యాపారం మీద బాగా ఆదాయ పొందిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ రైతు పాలమ్మి కోటి రూపాయాల ఇళ్లు కట్టించాడు. అలానే పాలమ్మి కోటిన్నర  సంపాదిస్తున్నారు. మరి.. ఆ రైతు ఎవరు.. ఆయన వివరాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం..

మహారాష్ట్ర లోని షోలాపూర్ ప్రాంతంలో ప్రకాశ్ అనే రైతు పశువుల పోషణతో జీవనం సాగిస్తున్నాడు.  వాటి ద్వారా వచ్చే పాలను అమ్మి బాగా ధనం  అర్జించాడు. పాలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుల్లో కోటి రూపాయలు పెట్టి అద్భుతంగా ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటిపై  పాల క్యాన్, ఆవు బొమ్మలను కూడా కట్టించుకున్నాడు. ఇక ఆ బొమ్మలను అటుగా వెళ్లే వారు విచిత్రంగా  చూస్తూ వెళ్తున్నారు. మరికొందరు అయితే ఆ ఇంటి బొమ్మలను వారి ఫోన్లలో బంధిస్తున్నారు. అంతేకాక కొందరు ప్రకాశ్ వద్దకు వచ్చి.. ఏంటి ఇలా ఆవు, పాల క్యాన్ విగ్రహాలు పెట్టుకున్నావని అడిగితే… ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు.

తన తాతల కాలం నుంచి వచ్చిన 4 ఎకరాల భూమి సాగుకు పనికి రాకుండా పోయింది. దీంతో ఇక జీవనం చాలా కాష్టంగా మారింది. దీంతో 1998 ఓ ఆవు తెచ్చుకుని పాల వ్యాపారం ప్రారంభించాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు లీటరు పాలతో ప్రారంభించి.. నేడు రోజుకు వెయ్యి లీటర్ల  అమ్మే స్థాయికి ఎదిగాడు. ఇలా కేవలం పాలను మాత్రమే అమ్మికాకుండా ఆవుల నుంచి వచ్చే పెండను కూడా అమ్మేవారు. అలా పాలు, పెండను అమ్మి ఏడాదికి కోటిన్నర రూపాయాలు సంపాదిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఆయనకు తక్కువగా చూసిన వాళ్లే నేడు బాపు, బాపు అంటూ ఎంతో గౌరవంగా పిలుస్తున్నారంట. ఈ రైతు.. అదే గ్రామంలోని యువతకు ఉపాధి కూడా కల్పించాడు. కేవలం బయటి వారికి ఉపాధి ఇవ్వడమే కాదు.. కొడుకులు, కోడళ్లు అందరూ ఈ పాల డైరీలోనే పని చేస్తున్నారు.

ఇలా పాల ద్వారానే ఇంతపెద్ద ధనవంతుడిగా మారానని.. వాటికి గుర్తుగా పాల క్యాన్, ఆవు బొమ్మలను తన కొత్త ఇంటిపై నిర్మించుకున్నాడు. అంతేకాక తాను తొలుత ఏ ఆవుతో పాల వ్యాపారం ప్రారంభించాడో.. అది 2000 సంవత్సరంలో మరణించింది. ఆ ఆవుకు లక్ష్మి అని పేరు పెట్టి.. ఓ గుడి కట్టించి..నిత్యం పూజలు చేస్తున్నాడు. అలా ప్రకాశ్ డైరీ ఫారమ్ లో పుట్టిన ఒక్క ఆవును కూడా ఇప్పటి వరకు అమ్మలేదు. ప్రస్తుతం 165 ఆవులు ఉన్నట్లు ప్రకాశ్  తెలిపాడు. వ్యాపారం చేస్తూనే.. ఆవులపై ఆయన చూపిస్తున్న ప్రేమకు అందరు ఫిదా అవుతున్నారు. మరి.. ఈ రైతుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియేజేయండి.

Show comments