వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌కే నా సపోర్ట్ అంటున్న ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలు విషయంలో కొన్ని రోజులు వార్తల్లో నిలిచిన ఎలాన్ మస్క్ తాజాగా అమెరికా రాజకీయాలపై వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తలకెక్కారు. అమెరికాలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అని రెండు పార్టీలు ఉన్నాయి. డెమొక్రాట్లు అంటే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పార్టీ. రిపబ్లికన్లు అంటే ట్రంప్ పార్టీ.

తాజాగా ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ.. గత ఎన్నికల్లో నేను డెమొక్రాట్‌లకు ఓటు వేసాను, కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం రిపబ్లికన్లకే ఓటు వేస్తాను అని బహిరంగంగా తన మద్దతు ఏ పార్టీకో చెప్పేశాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జోబైడెన్‌ ప్రభుత్వాన్ని (Democrat Party) ఉద్దేశించి.. గతంలో డెమొక్రాట్లకే ఓటు వేశాను. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు సౌమ్యమైన పార్టీ వ్యక్తులుగా ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం విభజన, ద్వేషం పెంచే పార్టీగా తయారవుతున్నారు. అందుకే ఇక నుంచి నేను వారికి మద్దతు ఇవ్వను, రిపబ్లికన్‌ (Donald Trump) పార్టీకే ఓటు వేస్తాను అని అన్నారు.

నేను ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు నాకు వ్యతిరేకంగా చెడు ప్రచారం చేస్తారు ఆ పార్టీ వాళ్ళు. రానున్న రోజుల్లో నాపై రాజకీయ దాడులు పెరుగుతాయి అని అన్నారు. ఎలాన్ మస్క్ కి కార్ల కంపెనీ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎలక్ట్రిక్‌ కార్ల పన్నుల విధానం విషయంలో బైడెన్‌ ప్రభుతాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇక గతంలో ట్విట్టర్ ట్రంప్ పై నిషేధం విధించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌పై నిషేధాన్ని తీసేస్తానని తెలిపాడు. దీంతో ఎలాన్ మస్క్ చేస్తున్న వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో చర్చలకు దారి తీస్తున్నాయి.

Show comments