iDreamPost
android-app
ios-app

యూజర్లకు షాక్!.. ఇకపై ఎక్స్ వాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!

యూజర్లకు షాక్!.. ఇకపై ఎక్స్ వాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!

సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరో షాకిచ్చాడు. ఇకపై ఎక్స్ వాడాలంటే కొంత డబ్బు చెల్లించాలని బాంబ్ లాంటి వార్త ప్రకటించాడు.ట్విట్టర్ ను తన హస్తగతం చేసుకున్నాక ఎలాన్ మస్క్ ఎన్నో మార్పులు చేశాడు. ఆఖరికి ట్విట్టర్ లోగోను కూడా మార్చేశాడు. ఇప్పుడు మరో కొత్త విధానానికి తెరలేపాడు. ఎక్స్ లో ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌ పాలసీని ప్రయోగాత్మకంగా న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో అందుబాటులోకి తెచ్చామని ఎలాన్ మస్క్‌ పేర్కొన్నారు.

‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారం కొత్త ఎక్స్ యూజర్లు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్స్ లో మెసేజ్ లను లైక్ చేయడం, రీ పోస్ట్ చేయడం, బుక్ మార్క్ చేయాలంటే యూజర్లు సంవత్సరానికి ఒక డాలర్ చెల్లించాల్సి ఉంటుందని మస్క్ వెల్లడించాడు. అయితే ప్రస్తుతానికి ఈ నిబంధనను కొత్త యూజర్లకు మాత్రమే పరిమితం చేసింది. ఇప్పటికే ఎక్స్‌ అకౌంట్ ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధానితో మస్క్ భేటీ సందర్భంగా ఈ విషయం చెప్పారు.

వెబ్‌ వెర్షన్‌లో ఇతరుల సందేశాలను రీపోస్ట్‌ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్‌ చేయడం, ఇతరుల ఖాతాలను మెన్షన్‌ చేయడం లాంటి ఫీచర్లు కావాలనుకునే వారు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఖాతా తెరిచి.. పోస్ట్‌లను చదవడం ఫొటోలు-వీడియోలు చూడ్డానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కాగా ఎక్స్ లో నకిలీ ఖాతాలను అరికట్టేందుకు పలు రకాల చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు మస్క్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ప్రవళిక కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం. ఆమె తమ్ముడికి ఉద్యోగం KTR

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి