iDreamPost
iDreamPost
రాజధాని పేరిట అమరావతిలో జరిగిన భూ కుంభకోణం పై విచారణ వేగంగా జరుగుతోంది. తెలుగుదేశం నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధాని ప్రాంతంలో భూ దోపిడికి కి పాల్పడిన విషయం తేలిసిందే. దీనిపై నిజాలు నిగ్గు తెల్చెందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. తొలుత ప్రభుత్వ కేబినేట్ సబ్ కమిటి నివేదిక ఆదారంగా విచారణ చెసిన సి.ఐ.డి, మొత్తం నాలుగు వేల ఎకరాల్లో భూములు కోనుగోళ్లలో అక్రమాలు జరినట్టు గుర్తించింది. దింతో పాటు తెలుగుదేశం నేతలు మొత్తం 797 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేరుతొ 761.34 ఎకరాలు భూములు కోనుగోలు చెసినట్టు సి.ఐ.డి అధికారులు గుర్తించ్చిన విషయం తెలిసిందే. అయితే తెల్ల రేషన్ కార్డు దారుల ముసుగులో తెలుగుదేశం నేతలు మనిలాండరింగ్ కి కూడ పెద్ద ఎత్తున పాల్పడినట్టు సి.ఐ.డి అధికారుల దర్యాప్తులో విస్తుపొయే వాస్తవాలు వెలుగులోకి రావడంతో దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలనే ఉద్దేశం తో చెన్నైలో ఉన్న ఈడి కార్యాలయానికి సి.ఐ.డి అధికారులు లేఖ రాసారు.
సి.ఐ.డి అధికారుల రాసిన లేఖ ఆదారంగా రంగంలోకి దిగిన చెన్నై ఈడి అధికారులు, హైద్రబాదులో ఉన్న ఈడి అధికారులకు రాజధాని భూదోపిడిపై మరింతలోతుగా దర్యాప్తు చెయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైద్రాబాద్ లో ఉన్న ఈడి అధికారులు సి.ఐ.డి అధికారులు చేసిన దర్యాప్తు నివేదికను పరిశీలించి దీని ఆదారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద కేసు నమోదు చెసినట్టు తెలుస్తుంది. కాగా ప్రభుత్వ కేబినేట్ సబ్ కమిటి నివేదిక ఆదారంగా విచారణ చెసిన సి.ఐ.డి, మొత్తం 4వేల ఎకరాల్లో భూములు కోనుగోళ్లలో చంద్రబాబు నాయుడు , లొకేష్ , పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పత్తి పాటి పుల్లరావు, నారాయణ లాంటి తెలుగుదేశం పార్టి బడా నేతలు పేర్లు బయటికి రావడంతో పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరింత మంది తెలుగుదేశం నేతల పేర్లుబయటకొచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు ఆ పార్టికి వెనక నుండి అర్ధికంగా అండదండలు అందించిన బడా పారిశ్రామిక వేత్తల భూ భాగోతం కూడా బయటపడటం తథ్యం అనే వాదన ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.