iDreamPost
android-app
ios-app

జర్మనీలో వైద్యుల అర్ధనగ్న నిరసన.. ఎందుకంటే..?

జర్మనీలో వైద్యుల అర్ధనగ్న నిరసన.. ఎందుకంటే..?

మహమ్మారి కరోనా వైరస్ కట్టడిలో పేద దేశాలే కాదు.. ధనిక దేశాలు అల్లాడి పోతున్నాయి. ఔషధాలు, రక్షణ సామాగ్రి కొరతతో ప్రపంచం ప్రమాదకర పరిస్థితుల్లో పడింది. ఈ పరిస్థితికి అద్దం పట్టేలా జర్మనీలో ఓ సంఘటన జరిగింది. కరోనా వైరస్ కు ఎదురొడ్డి ప్రజల ప్రాణాలు రక్షిస్తున్నా..తమ ప్రాణాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తగినన్ని పీపీఈ కిట్లు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని డాక్టర్లు వైద్య పరికరాలను అడ్డుగా పెట్టి నిరసన చేపట్టారు. వెంటనే తమకు అత్యవసరమైన పీపీఈ కిట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

అయితే వాస్తవ పరిస్థితిని వైద్యులు వివరిస్తూ వారిని సముదాయించే ప్రయత్నం చేస్తోంది ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, గ్లౌస్, పీపీఈ కిట్లకు భారీగా డిమాండ్ పెరిగినందున కొరత నెలకొందని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 133 మిలియన్ మాస్క్ లను పంపిణీ చేశామని తెలిపింది. వాటిలో పది లక్షల మాస్కులు చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పేర్కొన్నారు.

జర్మనీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఫలితంగా మార్కులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికీ మాస్కులు కొరత నెలకొంది. ప్రజలకు మరో 15 మిలియన్ల మాస్కులు పంపిణీ చేయనున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. జర్మనీలో వైరస్ సోకినా వారి సంఖ్య 1.50 లక్షలు దాటగా.. 6 వేల మంది చనిపోయారు.