చంద్రబాబు,జగన్ .. పనివిధానంలో ఎంత తేడా !!!

ఇపుడిదే విషయమై జనాలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఏపి జనాలు కావచ్చు లేదా తెలంగాణాలోని జనాలు కూడా కావచ్చు ఇద్దరు నేతల మధ్య పోలికల గురించి చర్చించుకుంటున్నారు. ఇపుడీ పోలికల గురించి జనాలు ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబునాయుడుకు పాజిటివ్ గా చాలా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ’కరోన వైరస్ కారణంగా తలెత్తిన సంక్షోభ సమయంలో చంద్రబాబు అధికారంలో ఉండుంటేనా’ అంటూ నాలుగు నిముషాల వీడియో బాగా చక్కర్లు కొడుతోంది.

నిజానికి చంద్రబాబు పనితీరు ఎలాగుంటుందంటే గోరంత పనిచేసి కొండంత ప్రచారం చేయించుకుంటాడు. ప్రతి చిన్ని పనికి కూడా చాలా పెద్ద హడావుడి చేసి ఎల్లోమీడియాలో విపరీతమైన ప్రచారం చేయించుకోవటం అలవాటు. అమరావతి శంకుస్ధాపనలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు పనుల విషయం కూడా కావచ్చు. చంద్రబాబుకు అసలు కన్నా కొసరే ఎక్కువిష్టం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇటువంటి సంక్షోభ సమయంలో అధికారంలో లేకపోయానే అనే బాధ చంద్రబాబుతో పాటు భజన బృందంలో కూడా బాగా కనిపిస్తోంది.

ఇక జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుంటే ప్రచారం కన్నా పనులు జరగటమే ముఖ్యమని అనుకుంటాడు. ఎవరెవరికి ఏమేమి పనులు చేయాలో చెప్పేసి వాళ్ళని పనులు చేసుకునే అవకాశం ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ జగన్ లోపమేమిటంటే చేసిన పనులను కూడా చెప్పుకోలేకపోతున్నాడు. పనులు చేయటం ఎంత ముఖ్యమో పనులు చేసినట్లు జనాలకు తెలియటం కూడా అంతే ముఖ్యం. జగన్ మొదటి విషయంలో సక్సెస్ అవుతున్నా రెండో దానిలో మాత్రం వెనకబడ్డాడనే చెప్పాలి.

కరోన వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలనే గమనిస్తే జగన్ గట్టి చర్యలు తీసుకుంటున్నాడు కాబట్టే ఇప్పటికీ 23 కేసుల దగ్గరే ఆగిపోయింది. పక్కనే ఉన్న తెలంగాణాలో కేసుల సంఖ్య 70 దాటిపోయింది. గ్రామ, వార్డు వాలంటీర్లు లక్షల మందిని రంగంలోకి దింపటంతో పాటు యావత్ యంత్రాంగాన్ని 24 గంటలూ పనిచేయిస్తున్నాడు కాబట్టే కేసుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ విషయాల్లోనే జగన్-చంద్రబాబు పనితీరులో తేడాలపై జనాల్లో చర్చలు జరుగుతున్నాయి.

Show comments