iDreamPost
ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో సామాన్య ప్రేక్షకులకు అసలిది రిలీజయ్యిందనే సంగతి పెద్దగా తెలియలేదు.
ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో సామాన్య ప్రేక్షకులకు అసలిది రిలీజయ్యిందనే సంగతి పెద్దగా తెలియలేదు.
iDreamPost
రేపు పొన్నియన్ సెల్వన్ 1 లాంటి విజువల్ గ్రాండియర్ రాబోతున్నా సరే ఒక రోజు ముందు పోటీకి సిద్ధపడి రిస్కు తీసుకున్న సినిమా ధనుష్ నేనే వస్తున్నా. ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో సామాన్య ప్రేక్షకులకు అసలిది రిలీజయ్యిందనే సంగతి పెద్దగా తెలియలేదు. తిరు బాగానే ఉన్నప్పటికీ కేవలం పబ్లిసిటీ లోపం వల్ల థియేటర్ జనానికి రీచ్ కాలేదు. అలాంటిది ఒక పరిమిత జానర్ కే అప్పీలయ్యేలా ఉన్న నేనే వస్తున్నాకు కనీసం ఈవెంట్లు గట్రా చేసుంటే ఓపెనింగ్స్ అయినా దక్కేవి. రఘువరన్ బిటెక్ నుంచి తెలుగులోనూ కొంత ఫాలోయింగ్ తెచ్చుకున్న ధనుష్ స్వంత అన్నయ్య సెల్వ రాఘవన్ ఈ నేనే వస్తున్నాకు దర్శకుడు. ఇంతకీ సినిమా ఎలా ఉందో రిపోర్ట్ చూద్దాం
ఇదో కవలల కథ. కథిర్(ధనుష్)కు చిన్నప్పటి నుంచే మానసిక సమస్యలు ఉండటంతో అతని ఎదుగుదలలో లోపాలు ఉంటాయి. తల్లితండ్రుల పెంపకంతో పాటు ఒక సైకో కిడ్నాపర్ వల్ల కథిర్ కూడా అలాగే మారిపోతాడు. మరోవైపు ప్రభు(ధనుష్)కుటుంబమే ప్రాణంగా భావించే ఒక సగటు మనిషి. హాయిగా సాగిపోతున్న ఇతని జీవితంలోకి కోల్డ్ బ్లడెడ్ కిల్లర్ గా మారిన కథిర్ ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రభు కూతురు దెయ్యాలతో మాట్లాడ్డం కనిపిస్తుంది. ప్రభు జీవితం ప్రమాదంలో పడుతుంది. అసలు కథిర్ తిరిగి ఎందుకు వచ్చాడు, అతన్ని సోదరుడు ఎలా ఎదిరించాడనేది తెరమీద చూడాల్సిన బ్యాలన్స్
అప్పుడెప్పుడో వచ్చిన కమల్ హాసన్ అభయ్ తో మొదలుపెట్టి కొన్ని హాలీవుడ్ మూవీస్ నుంచి సెల్వ రాఘవన్ స్ఫూర్తి తీసుకున్నాడని మొదలైన కాసేపటికే అర్థమవుతుంది. కథనం నెమ్మదిగా సాగుతూ ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గర ఒక డిఫరెంట్ ఫీల్ ఇచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ లో పూర్తిగాచేతులెత్తేయడంతో నేనే వస్తున్నా యావరేజ్ కూడా అనిపించుకోలేకపోయింది. ధనుష్ పెర్ఫార్మన్స్, యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం, ఛాయాగ్రహణం టాప్ స్టాండర్డ్ లో ఉన్నప్పటికీ కథా కథనాలు ఆ స్థాయిలో లేక ఒక డిఫరెంట్ అటెంప్ట్ వృథాగా మిగిలిపోయింది. క్లైమాక్స్ తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. హీరో డైరెక్టర్ కు ఎంత వీరాభిమానులైనా సరే ఈ నేనే వస్తున్నాని తట్టుకోవడం కష్టమే.