iDreamPost
android-app
ios-app

Nayanathara – Dhanush: ధనుష్ పై నయనతార సంచలన ఆరోపణలు! అసలేం జరిగిందంటే?

  • Published Nov 16, 2024 | 3:39 PM Updated Updated Nov 16, 2024 | 3:39 PM

Nayanathara - Dhanush: నయనతార ధనుష్ పై రెచ్చిపోయింది. తాజాగా సంచలన ఆరోపణలు చేసింది.

Nayanathara - Dhanush: నయనతార ధనుష్ పై రెచ్చిపోయింది. తాజాగా సంచలన ఆరోపణలు చేసింది.

  • Published Nov 16, 2024 | 3:39 PMUpdated Nov 16, 2024 | 3:39 PM
Nayanathara – Dhanush: ధనుష్ పై నయనతార సంచలన ఆరోపణలు! అసలేం జరిగిందంటే?

న‌య‌న‌తార‌, ధ‌నుష్‌.. ఇద్ద‌రూ మంచి నటీ నటులు. వీరి సినిమా కెరీర్ లో కొన్ని వివాదాలు వచ్చినా కానీ వాటికి దూరంగా ఉన్నారే తప్ప వాటిపై ఎప్పుడు రియాక్ట్ కాలేదు. తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగారు. స్టార్ యాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే… న‌య‌న‌తార ఇప్పుడు ఓ లెట‌ర్ ని విడుద‌ల చేసింది. అందులో ధ‌నుష్ పై ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతున్నాయి. ఈ లెటర్ ఇప్పుడు కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ లెటర్ చదివాకా అసలు న‌య‌న్, ధ‌నుష్ ల మ‌ధ్య ఇన్ని విబేధాలు ఉన్నాయా? ఇద్ద‌రి మ‌ధ్య ఇంత స్టోరీ న‌డిచిందా? అంటూ అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఈ లెట‌ర్ లో ఏముంది? ధ‌నుష్‌, న‌య‌న్ తారల మ‌ధ్య న‌డుస్తున్న ఈ వివాదం ఏమిటి? గతంలో వీరిద్దరి మధ్య ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నయనతార తన పెళ్లి, జీవిత విశేషాలతో ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తుంది. ఈనెల 18న నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంట‌రీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ‘నానుమ్ రౌడీ దాన్‌’ (తెలుగులో నేనూ రౌడీనే) సినిమా స‌మ‌యంలో తీసిన 3 సెక‌న్ల వీడియో క్లిప్ ని వాడారు. అదే ఈ వివాదానికి దారి తీసింది. ఎందుకంటే ఈ సినిమాకి ధ‌నుష్ నిర్మాత‌. త‌న పర్మిషన్ లేకుండా ఈ సినిమా క్లిప్స్ ఉప‌యోగించ‌డంపై ధ‌నుష్ చాలా సీరియ‌స్ అయ్యాడట. దాంతో కాపీ రైట్ యాక్ట్ కింద త‌న‌కు నయన్ రూ.10 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపాడు. ఈ గ్యాప్ లో ధ‌నుష్‌, న‌య‌న‌తార మ‌ధ్య రాజీ కుద‌ర్చ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయట. న‌య‌న్ తార ధ‌నుష్‌కి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం కూడా చేసిందట. కానీ ధ‌నుష్ ఏమాత్రం విన‌లేదు. దాంతో న‌య‌న్ కి కూడా కోపం పీక్ స్టేజీకి వెళ్ళిపోయింది. అందుకే కోపంతో సోష‌ల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టింది. గొప్ప తండ్రి, సోదరుడి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అని, నాలాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని అది మన అందరికీ తెలుసని రాసుకొచ్చింది. ఇంకా.. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి నేను ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఇందులో ఎలాంటి దాపరికం లేదని నయనతార సంచలన కామెంట్స్ చేసింది.

కేవ‌లం మూడు సెక‌న్ల వీడియో కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేయ‌డం చాలా దారుణ‌మ‌ని, ధ‌నుష్ ఇంత‌లా దిగ‌జారాల్సిన పని లేద‌ని, పాత క‌క్షల్ని, కోపాల్ని మైండ్ లో ఉంచుకొని ధ‌నుష్ ఈ ప‌ని చేశాడంటూ న‌య‌న్ ఆరోపించింది. ధ‌నుష్ పైకి ఒక‌లా, లోప‌ల ఒక‌లా క‌నిపిస్తాడ‌ని, పక్కనోళ్ళు ఎదిగితే తట్టుకోలేడని కాస్త హాట్ గానే విమ‌ర్శ‌లు చేసింది. అస‌లు ధ‌నుష్ కి మ‌న‌స్సాక్షి లేద‌ని, సినిమా విడుద‌లై ప‌దేళ్లు అయిపోయినా కూడా ఆ సినిమాపై కాపీ రైట్ యాక్ట్ కింద డ‌బ్బులు వ‌సూలు చేయాల‌నుకోవ‌డం, అది కూడా మూడు సెక‌న్ల క్లిప్పింగ్ కి ఇన్ని కోట్లు డిమాండ్ చేయ‌డం చాలా దారుణ‌మ‌ని కామెంట్స్ చేసింది. ‘నేనూ రౌడీనే’ హిట్ట‌వ్వ‌డం, హీరోయిన్ గా త‌న‌కు పేరు రావ‌డం చూసి ధ‌నుష్ త‌ట్టుకోలేక‌పోయాడ‌ని, అందుకే త‌న అహం దెబ్బ‌తిన్న‌ద‌ని, 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డుల స‌మ‌యంలోనే త‌న అక్క‌సు బ‌య‌ట‌పెట్టుకొన్నాడని, ప‌దేళ్ల నుంచీ ఆ కోపాన్ని మ‌న‌సులోనే దాచుకున్నాడాని, ఫైనల్ గా ఇప్పుడు బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని న‌య‌నతార ఆరోపించింది. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఇదంతా చూస్తూనే ఉంటార‌ని, వాళ్లెప్ప‌టికీ దీన్ని స‌హించ‌ర‌ని త‌న 3 పేజీల లెట‌ర్ లో తెలిపింది న‌య‌న్‌. ఇదీ సంగతి. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వివాదంపై ధనుష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet