iDreamPost
android-app
ios-app

ధనుష్ డైరెక్షన్ లో మహేశ్ బాబు? కాంబో పడితే బాక్సాఫీస్ షేకే..

  • Published Jul 31, 2024 | 11:09 AM Updated Updated Jul 31, 2024 | 11:09 AM

ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్ పై మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్ పై మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 31, 2024 | 11:09 AMUpdated Jul 31, 2024 | 11:09 AM
ధనుష్ డైరెక్షన్ లో మహేశ్ బాబు? కాంబో పడితే బాక్సాఫీస్ షేకే..

చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నారు. ఇంకొందరు నిర్మాణ రంగంలోకి కూడా దిగారు. ఇలా మల్టీటాలెంటెడ్ తో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇదే కోవలోకి వస్తాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఒక పక్క విభిన్నమైన సినిమాలు చేస్తూనే, మరోపక్క దర్శకత్వంలో కూడా రాణిస్తున్నాడు. తాజాగా ధనుష్ స్వీయదర్వకత్వంలో వచ్చిన ‘రాయన్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. సినిమా అద్భుతంగా ఉందని, అందరూ చూడాలని రివ్యూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘రాయన్’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ధనుష్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన మూవీగా రాయన్ నిలిచింది. ఇక ఈ మూవీని చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ చిత్రాన్ని చూసి, తన రివ్యూను తెలియజేశాడు. రాయన్ అద్భుతంగా ఉందని, అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా అని, ధనుష్ యాక్టింగ్, డైరెక్షన్ సూపర్ అని ప్రశంసించాడు. అయితే మహేశ్ ట్వీట్ తర్వాత ఓ కొత్త ప్రతిపాదన తెస్తున్నారు సినీ లవర్స్.

ధనుష్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేశ్ నటిస్తే ఎలా ఉంటుంది? అన్న క్యూరియాసిటీ మూవీ లవర్స్ లో మెదిలింది. డైరెక్షన్ పై అద్భుతమైన పట్టున్న ధనుష్ లాంటి స్టార్ కి సూపర్ స్టార్ తోడైతే.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్నది అభిమానుల కోరిక. మరి ఈ కాంబోలో సినిమా ఉంటుందా? అంటే భవిష్యత్ లో ఉండే అవకాశాలు కొట్టిపారేయలేం అంటున్నారు అభిమానులు. అద్భుతమైన కథలను అంతే అద్భుతంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు ధనుష్. అలాంటిది వీరి కాంబినేషన్ లో సినిమా పడితే.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు సినీ పండితులు. మరి ధనుష్-మహేశ్ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio