iDreamPost
android-app
ios-app

రాయన్ మూవీపై మహేశ్ బాబు రివ్యూ! ఏమన్నారంటే..

  • Published Jul 30, 2024 | 10:57 AM Updated Updated Jul 30, 2024 | 10:57 AM

Mahesh Babu Review On Raayan: ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్ సినిమా విడుదలైన సంగతి తెలిసింది. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రివ్యూ ఇచ్చారు

Mahesh Babu Review On Raayan: ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్ సినిమా విడుదలైన సంగతి తెలిసింది. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రివ్యూ ఇచ్చారు

  • Published Jul 30, 2024 | 10:57 AMUpdated Jul 30, 2024 | 10:57 AM
రాయన్ మూవీపై మహేశ్ బాబు రివ్యూ! ఏమన్నారంటే..

ప్రతి వారం అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. కొన్ని సినిమాల విషయంలో స్టార్ హీరోలు కూడా రియాక్ట్ అవుతుంటారు. ఆ సినిమాపై రివ్యూలు ఇస్తూ..తమ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. అంతేకాక మరికొన్ని సినిమాల విషయంలో అయితే.. పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్ సినిమా విడుదలైన సంగతి తెలిసింది. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ఇది ఇలా ఉంటే..తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్  రివ్యూ ఇచ్చారు. మరి.. ప్రిన్స్ మహేశ్ బాబు రాయన్ పై ఏమన్నారో ఇప్పుడు చూద్దాం…

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనుష్ అన్నా.. ఆయన సినిమాలన్న ఓ హైప్ క్రియేట్ అవుతుంది. వెరైటీ కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం ధనుష్ ప్రత్యేకత. నటనతో, మూవీ సెలక్షన్ తో కోలీవుడ్ లో ప్రత్యేకంగా నిలిచాడు. ఇప్పటికే అనేక విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన ధనుష్..తాజాగా రాయన్ మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఇది ధనుష్ 50వ సినిమా కావడం ఒక ప్రత్యేకత అయితే.. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం చేశారు. ఇది ఇలా ఉంటే.. భారీ అంచనాల మధ్య జూలై 26న విడులైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాక  ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ మంచి కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సెలబ్రిటీలు పోస్టు పెట్టారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేశ్‌బాబు ఎక్స్‌ వేదికగా ఈ సినిమాకు రివ్యూ పోస్ట్ పెట్టారు. అద్భుతమైన డైరెక్షన్ తో పాటు మంచి యాక్టింగ్ తో ధనుష్‌ అదరగొట్టారని, ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్‌, సందీప్ కిషన్‌లు చాలా బాగా నటించారని మహేష్ తెలిపారు.  ఈ మూవీలోని అందరూ వందశాతం మంచి నటన కనబరిచారని, మ్యాస్ట్రో ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ మరో అద్భుతమని మహేశ్ పోస్టు చేశారు.

అంతేకాక ‘రాయన్‌’ కచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ అని, రాయన్ టీమ్ కి కంగ్రాట్స్ అంటూ మహేశ్ బాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు సందీప్‌ కిషన్‌ రియాక్ట్  అవుతూ.. మహేశ్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాయన్ టీమ్ ను కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కూడా అభినందించారు. సినిమా విజయం సాధించినందుకు  విషేష్ చెప్పారు. అదే విధంగా నటుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ కూడా తాజాగా ‘రాయన్‌’ వీక్షించారు. ధనుష్‌ దర్శకత్వం, యాక్టింగ్‌ సూపర్ గా ఉందంటూ ప్రశంసించారు. మొత్తంగా రాయన్ సినిమాపై  మహేశ్ పై పాజిటీవ్ రివ్యూ ఇవ్వడంతో..మరింత ప్లస్ కానుంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet