iDreamPost
android-app
ios-app

ధనుష్ ‘రాయన్’ మూవీకి అరుదైన గౌరవం! ఏకంగా ఆస్కార్..

  • Published Aug 02, 2024 | 3:21 PM Updated Updated Aug 02, 2024 | 3:21 PM

ధనుష్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన 'రాయన్' మూవీ.. తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా ఆస్కార్ నుంచి గౌరవాన్ని అందుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ధనుష్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన 'రాయన్' మూవీ.. తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా ఆస్కార్ నుంచి గౌరవాన్ని అందుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ధనుష్ ‘రాయన్’ మూవీకి అరుదైన గౌరవం! ఏకంగా ఆస్కార్..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘రాయన్’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ధనుష్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టి రికార్డ్ నెలకొల్పింది. ఇక ఇప్పుడు ఓ అరుదైన ఘనతను ఈ మూవీ సొంతం చేసుకుంది. విడుదలైన కొన్ని రోజులకే ధనుష్ మూవీ ఈ ఘనత సాధించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

‘రాయన్’.. ధనుష్ నటించిన 50వ చిత్రంగా, అతడి స్వీయ దర్శకత్వంలో యాక్షన్ క్రైమ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. లేటెస్ట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది ఈ మూవీ. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది రాయన్. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో రాయన్ స్క్రీన్ ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకుంది. అలాగే ధనుష్ కు శుభాకాంక్షలు తెలిపింది.

కాగా.. గొప్ప గొప్ప స్క్రీప్ట్, స్క్రీన్ ప్లేలకు మాత్రమే ఆస్కార్ అకాడమీ లైబ్రరీలో చోటు కల్పిస్తారు. ఇంతకు ముందు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది వ్యాక్సిన్ వార్’ తో పాటుగా తమిళ చిత్రం ‘పార్కింగ్’ కు కూడా ఈ గౌరవం దక్కింది. ఇక రాయన్ మూవీలో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. మరి ధనుష్ మూవీ రాయన్ స్క్రీన్ ప్లేకు ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.