iDreamPost
android-app
ios-app

రాయన్ లో ధనుష్ చెల్లెలుగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

  • Published Jul 27, 2024 | 9:02 PM Updated Updated Jul 27, 2024 | 9:02 PM

తాజాగా కోలీవుడ్ ధనుష్ నటించి రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాయన్. ఇక ఈ సినిమాలో ధనుష్ చెల్లెలుగా మంచి ఫవర్ ఫుల్ పాత్రను పోషించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

తాజాగా కోలీవుడ్ ధనుష్ నటించి రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాయన్. ఇక ఈ సినిమాలో ధనుష్ చెల్లెలుగా మంచి ఫవర్ ఫుల్ పాత్రను పోషించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

  • Published Jul 27, 2024 | 9:02 PMUpdated Jul 27, 2024 | 9:02 PM
రాయన్ లో ధనుష్ చెల్లెలుగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా ‘రాయన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే రాయన్ సినిమా ధనుష్ కెరీర్ లో 50వ సినిమా కావడం విశేషం. అంతేకాకుండా.. రాయన్ సినిమాకు దర్శకుడు కూడా ధనుషే. అయితే సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న శుక్రవారం (జూలై 26) ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది.అలాగే ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, వరలక్షి శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.

అయితే ఈ సినిమాలో ధనుష్ చెల్లెలుగా ఓ అమ్మాయి నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ అమ్మాయి రాయన్ సినిమాలో ధనుష్ చెల్లెలుగా పాత్ర పోషించిది అనడం కన్నా.. జీవించిందని చెప్పవచ్చు. ఎందుకంటే.. రాయన్ లో ఎంతోమంది స్టార్ యాక్టర్స్ నటించారు. కానీ, వారందరిలో ఈ చిన్నదాని యాక్టింగ్ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా.. రాయన్ సినిమాలో ధనుష్ యాక్టింగ్ తలపించేలా ఈ అమ్మాయి మంచి ఫవర్ ఫుల్ క్యారెక్టర్ ను పోషించింది.ఒక రకంగా చెప్పాలంటే.. ఈ సినిమాలో అందరీ నటన కంటే.. ఈమె నటనే ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ అయిపోయిందని చెప్పచ్చు. అయితే ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? ఎలా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 రాయన్ సినిమాలో ధనుష్ చెల్లెలుగా నటించిన అమ్మాయి పేరు’దుషారా విజయన్’. నిన్న మొన్నటి వరకు ఈ పేరు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారు మోగుతుంది. అందుకు కారణం రాయన్ సినిమాలో ఆమె చేసిన ఫవర్ ఫుల్ క్యారెక్టర్. అయితే ఈ చిన్నది మొదటిగా ఫ్యాషన్ డిజైనర్ గా చేసింది. అంతేకాకుండా దుషారా రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం గమన్హారం. ఇకపోతే ఫ్యాషనర్ డిజైనర్ గా చేస్తున్న దుషారా సినిమాల మీద ఆసక్తితో మొదటిగా ‘బోదై ఏరి బుద్ధి’ అనే సినిమాతో 2019లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కుల వేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత సార్పట్టా పరంబరై చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ క్రమంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దుషారాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో నక్షత్రం, నగర్గిరదు, కళువేత్తి, మూర్కన్, అనీతి వంటి చిత్రాల్లో అలరించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ధనుష్ హీరోగా నటించిన రాయన్ లో కూడా అవకాశం దక్కించుకుంది. పైగా ఈ సినిమాలో ధనుష్ చెల్లెలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతానికి దుషార రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వేట్టైయాన్’, విక్రమ్ సరసన ‘వీర ధీర శూరన్’ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio