iDreamPost
iDreamPost
అసలు ఏ ముహూర్తంలో అనుకున్నారో కానీ మహేష్ బాబు 28 రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకుండానే బోలెడు ఆటంకాలు ఎదురుకుంటోంది. మొదట్లో రాసుకున్న స్క్రిప్ట్ ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశాక మారిపోయింది. ఫైనల్ వెర్షన్ సిద్ధమవుతున్న టైంలో మహేష్ తల్లిగారు చనిపోవడంతో లాంగ్ బ్రేక్ వచ్చింది. తీరా అంత సిద్ధం చేస్తున్న తరుణంలో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే లాంటి ఆర్టిస్టుల డేట్ల సమస్యతో ఇంకొంత కాలం ఆగాల్సి వచ్చింది. ఫైనల్ గా ఎప్పుడనేది ఇంకా తేలలేదు కానీ ఈలోగా మరికొన్ని అనూహ్య పరిణామాలు జరిగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టులో సెకండ్ హీరోయిన్ గా రెండు నెలల క్రితం శ్రీలీల ఎంపికైన సంగతి తెలిసిందే
ఇప్పుడు తను అందులో నుంచి బయటికి వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. అసలు తను ఉందనే విషయమే అధికారికంగా చెప్పనప్పుడు ఇప్పుడు నిజంగా డ్రాప్ అయినా దాన్ని అఫీషియల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో సితార సంస్థ నుంచి నేరుగా ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. శ్రీలీల ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ధమాకా తర్వాత తన రేంజ్ డిమాండ్ రెండూ పెరిగిపోయాయి. రవితేజ లాంటి ఫుల్ ఎనర్జీ ఉన్న స్టార్ హీరో పక్కన డామినేట్ చేసే రేంజ్ లో గ్లామర్ ఒలకబోసి డాన్సు చేయడం చిన్న విషయం కాదు. ధమాకా మాస్ కి అంతగా రీచ్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని చెప్పక తప్పదు.
అందుకే ఇప్పుడొచ్చిన ఇమేజ్ ని కాపాడుకోవాలంటే సెకండ్ హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉండాలి. పైగా త్రివిక్రమ్ గత సినిమాల్లో ఈ క్యారెక్టర్లు చేసినవాళ్లుకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఈషా రెబ్బా(అరవింద సమేత వీర రాఘవ), నివేదా థామస్( ఆల వైకుంఠపురములో), అను ఇమ్మానియేల్(అజ్ఞాతవాసి), అఆ(అనుపమ పరమేశ్వరన్) ఇలా చెప్పుకుంటూ వీళ్ళకెవరికీ ఆ సినిమాల ఫలితాలతో ఎలాంటి పేరు రాలేదు. అలాంటిది ఇంత ఫామ్ వచ్చినప్పుడు శ్రీలీల అయినా ఎందుకు తొందరపడుతుంది. పైగా కొంచెం ఓపిక పడితే ఇదే మహేష్ బాబుకి డైరెక్ట్ జోడిగా నటించే ఛాన్సే కొట్టేయొచ్చు. అది కూడా ఎంతో దూరంలో లేదనిపిస్తోంది