ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ స్థాయిలో దసరా ఉంటుందా?

ఫ్యామిలీ మ్యాన్ గా కుటుంబ ప్రేక్షకులకు ఎక్కువ దగ్గరైన న్యాచురల్ స్టార్ నాని తన స్టయిల్ ని పూర్తిగా పక్కనపెట్టి చేసిన దసరా మార్చి 30న విడుదల కానుంది. నిన్న సాయంత్రం ఒక్కో భాషనుంచి ఒక్కో సెలబ్రిటీ టీజర్ లాంచ్ చేశారు. తెలుగు వెర్షన్ బాధ్యతను రాజమౌళి తీసుకున్నారు. బొగ్గు గనుల మధ్య ఉండే ఒక చిన్న ఊరిలో జరిగే సంఘటనలు, తమ జీవితాలను దెబ్బ కొట్టిన దుర్మార్గుల భరతం పట్టేందుకు పూనుకున్న ఆవేశభరితుడైన ఓ యువకుడి కథగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ దసరాని రూపొందించారు.

ఈవెంట్లో మాట్లాడిన నాని గత ఏడాది ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కాంతార లాగా 2023లో దసరా పెద్ద ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని హామీ ఇచ్చేశాడు. టీజర్ చూస్తేనేమో ఊర మాస్ విజువల్స్, వయొలెన్స్ తో ఆసక్తి పెంచేలా ఉంది. ముఖ్యంగా ఎప్పుడో నిప్పురవ్వ లాంటి సినిమాల తర్వాత మళ్ళీ కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో ఎవరూ తీయలేదు. పైగా నాని మరీ ఓవర్ మాస్ లుక్ దసరాలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్ ని ఇందులో ఎక్కడ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ట్రైలర్ కోసం దాచారని నానినే చెప్పాడు

అంతా బాగానే ఉంది కానీ నాని ఏకంగా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లతో పోల్చడం చూస్తుంటే ఫ్యాన్స్ కోణంలో ఊపిచ్చే విషయమే కానీ దీన్నే కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనుకుంటే కష్టం. టక్ జగదీశ్, అంటే సుందరానికి లాంటి క్లాస్ మూవీస్ లో ఆడియెన్స్ తనను రిసీవ్ చేసుకోలేకపోవడంతో నాని కంప్లీట్ మేకోవర్ కి సిద్ధపడ్డాడు. చూస్తుంటే దసరా ఒక కల్ట్ గా మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నాని ఇందులో సిల్క్ స్మిత వీరాభిమానిగా నటించాడు. ఇది కూడా రంగస్థలం, పుష్పల మాదిరే 90వ దశకంలో జరిగే రెగ్యులర్ స్టోరీనే కాకపోతే దసరాలో రానెస్ ఎక్కువ కనిపిస్తోంది

Show comments