iDreamPost
android-app
ios-app

వీడియో: ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచులో తప్పిన ప్రమాదం!

వీడియో: ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచులో తప్పిన ప్రమాదం!

వరల్డ్ కప్ 2023లో భాగంగా సోమవారం ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో వేదికగా ఎక్నా స్టేడియంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆట జరుగుతున్న సమయంలో వర్షం పడడంతో కాసేపు అంతరాయం కలిగింది. ఇక వర్షం ముగిసాక ఆట తిరిగి  ప్రారంభమైంది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం, గాలి దుమారం వచ్చింది. దీంతో స్ఠేడియంలో ఉన్న భారీ హోర్డింగ్ ఒక్కసారిగా అక్కడున్న సీట్లపై పడిపోయింది.

ఈ దెబ్బతో పక్కనున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ఆ సమయానికి అక్కడ ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే లక్నో వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి