iDreamPost
android-app
ios-app

ఎల్బీనగర్ హత్య కేసులో ట్విస్ట్.. ప్రేయసి, ఆమె సోదరుడ్నే కాదూ..

ఎల్బీనగర్ హత్య కేసులో ట్విస్ట్.. ప్రేయసి, ఆమె సోదరుడ్నే కాదూ..

ప్రేమ కోసం పరితపించి, ప్రేయసి కోసం ప్రాణాలు విడిచే దేవదాసు కాలం నుండి తనకు దక్కనిది, మరెవ్వరికీ దక్కకూడదన్న అనైతిక ఆలోచనలతో ప్రేయసిపై దాష్టీకానికి పాల్పడుతున్న రోజులకు చేరింది లోకం. ప్రేమికులు లవ్ అనే మైకంలో మునిగి తేలుతూ.. చెట్టాపట్టాలు వేసుకుని మునిగి తేలుతుంటారు. ఎక్కడైనా అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు విడిపోతుంటారు. కొంత మంది మూవ్ ఆన్ అయిపోతే.. మరికొంత మంది కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటారు. ఇలానే చేశాడు ఎల్బీనగర్ ప్రేమోన్మాది శివ కుమార్. తనను దూరం పెడుతుందన్న అక్కసుతో ప్రేయసిపై దారుణానికి ఒడిగట్టాడు. అడ్డువచ్చిన సోదరుడిపై విచక్షణారహితంగా పొడవడంతో అతడు చనిపోయాడు. ప్రియురాలు ప్రాణాలతో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతుంది. అయితే శివకు హత్యలు చేయడం కొత్త కాదూ..ఇది అతడు చేసిన మొదటి హత్య  కాదూ.. పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే..? అసలు ఏం జరిగిందంటే..?

రంగారెడ్డి జిల్లాలోని నేరెళ్ల చెరువు ప్రాంతానికి శివకుమార్.. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్ గౌడ్, ఇందిర దంపతులు కుమార్తె సంఘవి పదవి తరగతి నుండి క్లాస్ మేట్స్. అప్పటి నుండి ప్రేమలో ఉన్నారు. సంఘవికి వృధ్వీ, రోహిత్ అనే సోదరులు ఉన్నారు. సంఘవి ప్రస్తుతం రామాంతపూర్‌లోని హోమియోపతి కోర్సు నాలుగో ఏడాది చదువుతుంది. తన చదువుల నిమిత్తం ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో తన సోదరుడు పృధ్వీతో కలిసి ఉంటుంది. పృధ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. కాగా, శివకుమార్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. ప్రేమించిన యువతి కోసమే అతడు కూడా రామాంతపూర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా, ఇటీవల సంఘవి, శివ మధ్య గొడవలు రావడంతో అతడిని దూరం పెట్టింది. ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేసేసింది. మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా ఆమె వినిపించుకోకపోవడంతో సంఘవిపై అక్కసు పెంచుకున్నాడు శివ. ఆమెపై పీకల వరకు కోపం పెంచుకున్న అతడు ఆదివారం మధ్యాహ్నం కత్తి తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలికి చొరబడ్డాడు.

ఆ సమయంలో ఇంట్లో ఉన్న సోదరుడు పృధ్వీ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో పృధ్వీకి తీవ్ర రక్తస్రావమైంది. అతను ఇంటి నుండి బయటకు కొంత దూరం నడుకుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. ప్రేయసిని శివ గదిలో బంధించి ఆమెపై కూడా దాడి చేశాడు. గదిలో నుండి కేకలు వినిపించడంతో పాటు పృధ్వీని ఆ పరిస్థితుల్లో చూసిన స్థానికులు ఆ ఇంటికి చేరుకుని.. గది తలుపులు పగులకొట్టి శివను చితకబాదారు. రోడ్డుపై రక్తపు మడుగుల్లో పడిపోయిన పృధ్వీని ఆసుపత్రుల్లో చేర్చి.. పోలీసులకు సమాచారం అందించారు. కాగా, సంఘవి సోదరుర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ మరణించాడు. శివను అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడికి నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. గతంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు తల్లిదండ్రులను చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం శివ తన తండ్రిని సుత్తెతో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్దారించారు.