Krishna Kowshik
మావన సంబంధాలు రోజు రోజుకూ కుంచించికుపోతున్నాయి. దానికి కారణం డబ్బు. రూపాయి ఎంతటి పనినైనా చేయిస్తుందని ఉరకనే అనేలేదు. బంధాలు తెంచేయగలదు. మనుషుల్ని బానిసలు చేయగలదు. ముఖ్యంగా దారుణాలకు ఒడిగట్టేందుకు ఓ ఆయుధంగా మారిపోయింది దుడ్డు.
మావన సంబంధాలు రోజు రోజుకూ కుంచించికుపోతున్నాయి. దానికి కారణం డబ్బు. రూపాయి ఎంతటి పనినైనా చేయిస్తుందని ఉరకనే అనేలేదు. బంధాలు తెంచేయగలదు. మనుషుల్ని బానిసలు చేయగలదు. ముఖ్యంగా దారుణాలకు ఒడిగట్టేందుకు ఓ ఆయుధంగా మారిపోయింది దుడ్డు.
Krishna Kowshik
మనిషి పుట్టెటప్పుడు ఏమీ తీసుకురాడూ.. చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్లడని సూక్తులు చెబుతుంటారు. సూక్తి ముక్తావళి పక్కన పెడితే.. ఈ సమాజాన్ని నడిపిస్తుంది ముమ్మాటికి డబ్బే అన్నది జగమెరిగిన సత్యం. డబ్బు లేనిదే మనిషి మనుగడ సాధ్యం కాదు. రూపాయి ఎంతటి బంధాన్నైనా విడదీయగలదు. ఆస్తుల కోసం, అంతస్థుల కోసం కొట్లాడుకుంటున్న కుటుంబాలు ఎన్నో. అన్నాదమ్ములు, అన్నా, చెల్లెల్లు, అక్కా తమ్ముడు, అక్కా చెల్లెల్లు, చివరి ప్రాణంగా ప్రేమించే స్నేహితుల మధ్య కూడా కుంపటి పెట్టగలదు. అవసరమైతే దారుణాలకు కూడా ఒడిగట్టగలిగే సత్తా ఉన్న ఆయుధం నోటు మాత్రమే.
దూరంగా ఉద్యోగం చేసుకుంటూ.. సొంతూరు వ్యాపారం స్టార్ చేసి తమ్ముడ్ని చూసుకోమని అతడికి బాధ్యతలు అప్పగించాడు. అయితే ఇటీవల తిరిగి వచ్చిన అన్న.. ఆ వ్యాపారాన్ని భార్యకు ఇచ్చేయాలని కోరడంతో, కోపంతో వదిన, వారి పిల్లల్ని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హవేరి జిల్లా హానగల్ తాలూకా యళ్లూరు గ్రామానికి చెందిన హోన్నే గౌడ, గీతా మరిగౌడ భార్యా భర్తలు. వీరికి అకుల్, అంకిత అనే పిల్లలు ఉన్నారు . హోన్నేగౌడ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. స్వగ్రామంలో వ్యాపారాన్ని స్టార్ చేసి.. దాన్ని చూసుకోవాలని తమ్ముడు కుమార గౌడకు అప్పగించాడు.
అయితే ఇటీవల తిరిగి వచ్చిన హోన్నేగౌడ, ఆ వ్యాపారాన్ని తన భార్య పేరిట మార్చాలని కోరాడు. అతడు దుబాయ్ వెళ్లిపోయాడు. ఎప్పుడైతే అన్న వ్యాపారాన్ని అప్పగించాలని కోరాడో అప్పటి నుండి ఆగ్రహంతో రగిలిపోయాడు. స్వగ్రామంలో ఒంటరిగా పిల్లలతో ఉంటున్న వదినపై పగబట్టాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో గీత ముఖం, గొంతుపై అనేక సార్లు కత్తితో పొడవంతో ఆమె ముఖం ఛిద్రమైంది. ఆ కఠినాత్ముడు.. పిల్లలను కూడా చంపి అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.