iDreamPost
android-app
ios-app

బాలయ్య ఫ్యాన్స్ కి కిక్కిచ్చే పేరు

  • Published Oct 12, 2021 | 4:42 AM Updated Updated Oct 12, 2021 | 4:42 AM
  • Published Oct 12, 2021 | 4:42 AMUpdated Oct 12, 2021 | 4:42 AM
బాలయ్య ఫ్యాన్స్ కి కిక్కిచ్చే పేరు

అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ బాగా తిరిగే నానుడి జై బాలయ్య. ఇప్పుడిదే సినిమా పేరుగా మారబోతోందా అంటే ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ కి జై బాలయ్య టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నట్టు తెలిసింది. ఫిలిం ఛాంబర్ లో ఇటీవలే రిజిస్టర్ కూడా చేశారట. ఒకప్పటిలా ఇలాంటి వివరాలు ఇప్పుడు అఫీషియల్ గా బయటికి ఇవ్వడం లేదు కాబట్టి అనధికార వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు జై బాలయ్య ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి టీమ్ సిద్ధంగా ఉంది.

ఈ దసరా నుంచే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అఖండ రీసెంట్ గా పూర్తి చేశాక బాలయ్య ప్రస్తుతం ఆహా టాక్ షో కోసం బిజీ అయ్యారు. అయితే ఇటీవలే తన సినిమా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు కొన్ని కరోనా లక్షణాలు బయట పడటం అఖండ బృందాన్ని టెన్షన్ లో పెట్టింది. బాలయ్యతో పాటు మిగిలినవారు కూడా టెస్ట్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్ నెగటివ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అదే జరిగితే దసరా నుంచి జై బాలయ్య రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లొచ్చు. అఫీషియల్ కన్ఫర్మేషన్ పండగ రోజే ఇవ్వబోతున్నారు. తమన్ రెండోసారి బాలయ్య మూవీకి సంగీతం సమకూర్చడం విశేషం.

ఇంకా షూట్ మొదలుకాకపోయినా అప్పుడే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రవితేజ క్రాక్ తరహాలో ఇది కూడా పక్కా కమర్షియల్ స్టైల్ లో ఉంటుందట. రౌడీ ఇన్స్ పెక్టర్ నాటి బాలకృష్ణను ఇందులో చూడొచ్చని వినిపిస్తోంది. మరి అది పోలీస్ క్యారెక్టరా లేక సమరసింహారెడ్డి తరహాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. హీరోయిన్ సెలక్షన్ కూడా జరుగుతోంది. ఇంకా ఎవరినీ లాక్ చేయలేదు కానీ రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకపక్క బాబీ డైరెక్షన్లో చిరంజీవితో మరోపక్క బాలయ్యతో ఇలా సీనియర్ స్టార్లతో మైత్రి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ల ప్లానింగ్ తో సాగుతోంది

Also Read : అబ్బాయిని మరిపించేలా బాబాయ్ మేజిక్ చేయాలి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom