అబ్బాయిని మరిపించేలా బాబాయ్ మేజిక్ చేయాలి

By iDream Post Oct. 11, 2021, 11:15 am IST
అబ్బాయిని మరిపించేలా బాబాయ్ మేజిక్ చేయాలి

ఎవరూ ఊహించని విధంగా త్వరలో చిన్న తెరపై డెబ్యూ చేయబోతున్న బాలకృష్ణ టాక్ షో మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇటీవలే ప్రోమో తాలూకు షూటింగ్ కూడా పూర్తి చేశారు. 10 ఎపిసోడ్లను ప్రాధమికంగా ఫిక్స్ చేశారట. దానికి అనుగుణంగానే బాలకృష్ణ డేట్లు ఇచ్చారని ఇన్ సైడ్ టాక్. అ!, కల్కి, జాంబీ రెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ దీనికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అతను చేస్తున్న హనుమాన్ తో సమాంతరంగా దీని షూట్ ని కూడా కొనసాగిస్తున్నారు. బాప్ అఫ్ ఆల్ టాక్ షో అని ట్యాగ్ లైన్ పెట్టడం ద్వారా ఇందులో ఏ రేంజ్ కంటెంట్ ఉంటుందో ఆహా సంస్థ ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతోంది

మొదటి ఎపిసోడ్ కు ఎవరు వస్తారనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. అభిమానులు మాత్రం పెద్ద సెలబ్రిటీనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. గతంలో సమంతా ఇదే ఆహాలో టాక్ షో చేసినప్పుడు చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి గట్టి సెలెబ్రిటిలు వచ్చారు. అలాంటిది ఇప్పుడు బాలయ్య అంటే ఇంకెవరు వస్తారో అన్నది ఆసక్తికరం. ఫాన్స్ మాత్రం చిరు నాగ్ వెంకీ లాంటి వాళ్ళతో పాటు చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఇప్పటి జెనరేషన్ హీరోలను కోరుకుంటున్నారు. ఇక హీరోయిన్ల సంగతి సరేసరి. అయితే ఉన్న పది ఎపిసోడ్లకు ఎవరు వస్తారు ఎవరు రాకపోవచ్చు అనేది ఇప్పటికిప్పుడు తేల్చే వ్యవహారం కాదు.

మాములుగా ఇంటర్వ్యూలలోనో మనసులో మాట నేరుగా చెప్పే అలవాటు ఉన్న బాలకృష్ణ బయట కొంత తడబతారనే విషయం తెలిసిందే. మరి ఈ ముఖాముఖీలో దాన్ని ఎలా కవర్ చేస్తారో చూడాలి. యాంకర్ గా సరికొత్త అవతారంలో ఎలా మెప్పిస్తారో చూడాలి. అబ్బాయి తారక్ ఇప్పటికే బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు ద్వారా వ్యాఖ్యాతగా సూపర్ సక్సెస్ అయ్యాడు. మరి బాబాయ్ బాలకృష్ణ అంతకు మించి చేస్తారేమో చూడాలి. స్ట్రీమింగ్ డేట్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా సబ్స్క్రిప్షన్స్ భారీగా పెరుగుతాయనే అంచనాలో ఆహా ఉంది. చూడాలి మరి స్మార్ట్ తెరపై నందమూరి హీరో విశ్వరూపం ఎలా ఉంటుందో

Also Read : మా' పీఠం మంచు విష్ణుదే !

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp