ఒకవైపు దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కరోనా వైరస్ సోకిన పేషంట్లకు చికిత్సలు అందిస్తున్న వైద్య సిబ్బందికీ రక్షణ కల్పించే పీపీఈ సూట్ లు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం కొత్తమూలపల్లె లో ఉన్న సెజ్ లో పెద్ద ఎత్తున తయారౌతున్నాయి.
ఇక్కడ నెలకొల్పిన ప్రత్యేక బొమ్మల తయారీ (పాల్స్ పల్స్) కెంద్రంలో ఈ పీపీఈ సూట్ లు తయారు చెయ్యడానికి ఉపయోగించే పీపీఈ క్లాత్ ను తెలంగాణ నుండి, ఇతర సామాగ్రి ని కర్ణాటక, తమిళనాడు తోపాటు కాకినాడ నుండి కూడా తెప్పిస్తున్నామని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. ఇక్కడ ఒక్క పీపీఈ సూట్ తయారీకి 500 నుండి 700 రుపాయాలు వరకు ఖర్చవుతుందని.. ప్రస్తుతం రోజు కి 500 సూట్లు తయారు అవుతుండగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు త్వరలోనే రోజుకి 5 వేల పీపీఈ సూట్లు తయారు చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఫ్యాక్టరీ యాజమన్యం తెలిపింది.
సీఎం ఆదేశాలతో తూర్పుగోదావరి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఐదు రోజుల కిందట ఇక్కడ సూట్ల తయారీ కేంద్రం లొ సూట్ల తయారీ ని రికార్డ్ సమయంలో ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 100శాతం రక్షణ ఇచ్చే విధంగా అంతర్జాతియ స్థాయి డెబ్ల్యు.హెచ్.ఓ ప్రమాణాల తో పీపీఈ సూట్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడనుండి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సరఫరా చేయడం మొదలుపెట్టామని అధికారులు తెలిపారు.