దేశంలో 96వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
మహారాష్ట్రలోనే 33 వేల పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజులో5,242 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య96,169 కు చేరింది. కాగా కరోనా కారణంగా3,029 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదయిన పాజిటివ్ కేసుల్లో గడచిన 24 గంటల్లో నమోదయిన కేసులే అత్యధికం.. నిన్న ఒక్కరోజులో 157 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి36,824 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.56,316 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ముంబయి నగరం మరో వుహాన్ గా మారనుందా?
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అత్యంత ఉధృతంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2,347 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఒక రాష్ట్రంలో ఓకేరోజు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. మహారాష్ట్రలో 33,053 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 63 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,198 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 20,150 మంది ఉండటం అక్కడి తీవ్రతకు అద్దంపడుతుంది. గడచిన 24 గంటల్లో 1595 కరోనా పాజిటివ్ కేసులు ముంబయిలో నమోదయ్యాయి. మరో వుహాన్ సిటీగా ముంబయి మారనుందా అని అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో నిన్న కొత్తగా 42 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 1551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 525 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 992 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 34 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 2380 కి మందికి కరోనా సోకగా 50 మంది మృత్యువాత పడ్డారు.1,456 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 874 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 4,801,875 మందికి కోవిడ్ 19 సోకగా 316,671 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,858,170 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,527,664 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 90,978 మంది మరణించారు.