iDreamPost
android-app
ios-app

దేశంలో 78 వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 78 వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడువేల ఐదువందల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతుండడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 3,725 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,055 కు చేరింది. కాగా కరోనా కారణంగా 2,551 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 26,400 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 49,099 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 1495 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో 25,922 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా 975 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 15,747 దాటగా పుణెలో 3,161 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో నిన్న కొత్తగా 41 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి  1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 394 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 939 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 34 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 48 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 2137 కి మందికి కరోనా సోకగా 47 మంది మృత్యువాత పడ్డారు.1,142 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 948 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 4,428,238 మందికి కోవిడ్ 19 సోకగా 298,083 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,657,905 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,430,348 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 85,197 మంది మరణించారు.

Jojobet GirişjojobetcasibomholiganbetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet