కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 18,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 603 మంది ప్రాణాలు కోల్పోగా, కరోనా వైరస్ బారినుండి 3260 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అత్యధిక మరణాలు, అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్రలో 4669 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ కాగా 232 మంది మృత్యువాత పడ్డారు. తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 919 పాజిటివ్ కేసులు నమోదవగా, 23 మంది మృతిచెందారు.ఈ ఒక్కరోజులోనే సూర్యాపేటలో 26 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో 757 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 22 మంది మృతిచెందారు. 96 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు. ఈ ఒక్కరోజులోనే ఆంధ్రప్రదేశ్ లో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా 25,03,459 మందికి కోవిడ్ 19 సోకగా,1,71,810 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 6,59,583 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 8 లక్షల మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 42,531 మంది మరణించారు.