iDreamPost
android-app
ios-app

దేశంలో విజృంభిస్తున్న కరోనా- 50 వేలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో విజృంభిస్తున్న కరోనా- 50 వేలకు చేరువలో కరోనా కేసులు

ఒక్కరోజులో 2958 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఒక్కరోజులో 3900 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కు చేరింది. కాగా కరోనా కారణంగా 1694 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 14,183 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో 33,514 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ఎక్కువ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం వల్ల దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు పెరిగింది.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 34 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో 15,525 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 617 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటివరకు 6245 కేసులు నమోదవ్వగా, 368 మంది మృతిచెందారు. 1042 మంది డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజులోనే 441 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 1096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 11 కేసులు నిర్దారణ అయ్యాయి. 29 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1717 మందికి కరోనా సోకగా 36 మంది మృత్యువాత పడ్డారు. 589 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. నిన్న 67 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 3,728,047 మందికి కోవిడ్ 19 సోకగా 258,356 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,242,500 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,237,633 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 72,271 మంది మరణించారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alhilarionbethilarionbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş