iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటి నిరోషా ఇంట్లో చోరీ..!

  • Published Sep 07, 2023 | 2:24 PM Updated Updated Sep 07, 2023 | 2:24 PM
  • Published Sep 07, 2023 | 2:24 PMUpdated Sep 07, 2023 | 2:24 PM
ప్రముఖ నటి నిరోషా ఇంట్లో చోరీ..!

సెలబ్రిటీల ఇళ్లల్లో ఇటీవల వరుస దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చిలో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య ఇంట్లో దొంగలు చొరబడి 60 సవర్ల బంగారు, వజ్రాభరణాలు దోచుకెళ్లిన సంగతి విదితమే. అయితే ఆ ఇంట్లో కొన్నేళ్ల నుండి పనిచేస్తున్న పనిమనిషి, మరో ఇద్దరు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే మరో సీనియర్ నటి, భరత నాట్య కళాకారిణి శోభన ఇంట్లో కూడా నగదు చోరీ అయ్యింది. ఇది కూడా పనిమనిషి పనే అని పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత ప్రముఖ సింగర్ విజయ్ ఏసుదాస్ నివాసంలో కూడా దొంగతనం జరిగింది. ఈ ఘటనలన్నీంటిని మర్చిపోక ముందే తాజాగా మరో సీనియర్ నటీమణి ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకు ఆ నటి ఎవరంటే..?

కోలీవుడ్ సీనియర్ నటి రాధిక సోదరి నిరోషా,రాంకీ ఇంట్లో దొంగతనం జరిగింది. నగలతో పాటు కొన్ని ఆస్తికి సంబంధించిన పత్రాలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని తేనాం పేట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అదే ప్రాంతంలోని జెమినీ భాసన్ అనే ప్రాంతంలో నివసిస్తున్నట్లు వెల్లడించింది. ఆ ఇంట్లోనే చోరీ జరిగినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే వారికి ఎవరి మీదన్న అనుమానం ఉందన్న సమాచారాన్ని నిరోషా, రాంఖీల నుండి సేకరిస్తున్నారు. ఇంటికి వచ్చిన అతిధులు, ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులపై ఆరా తీస్తున్నారు. నిరోషా 1980-90 దశకంలో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో మెరిశారు.

తెలుగులో చిరంజీవితో కలిసి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, బాలకృష్ణతో నారీ నారీ నడుమ మురారి, మోహన్ బాబుతో డిటెక్టివ్ నారద, రాజేంద్ర ప్రసాద్‌తో కొబ్బరి బోండాం, మహాజనానికి మరదలు పిల్ల, అత్తింట్లో అద్దె మొగుడు వంటి చిత్రాల్లో నటించారు. తమిళంలో సింధూర పువ్వే తెలుగులో డబ్బింగ్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ఘర్షణ వంటి సినిమాలతో గ్లామరస్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ సమయంలోనే తన సహానటుడు రాంఖీతో ప్రేమలో పడింది. 1995లో వివాహం చేసుకున్నారు వీరిద్దరూ. ఇప్పటి వరకు అన్యోన్యోంగా కలిసి ఉంది ఈ జంట. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌లో కనిపించింది నిరోషా. ఇప్పుడు అక్కలాగే తమిళ సీరియల్స్ లో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే వచ్చిన సినిమా అవకాశాలను చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం రజనీకాంత్ లాల్ సలాంలో రజనీకాంత్ భార్యగా నటిస్తోంది. ఈ సినిమాకు రజనీ కుమార్తె ఐశ్వర దర్శకత్వం వహిస్తున్నారు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş