సంక్రాంతి సినిమాల పోటీల్లో మహేష్, బన్నీ మాత్రమే ఉన్నారు. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మురగదాస్ SPYDER ఇంకా పీడకలలా గుర్తుంది. రజనీకాంత్ సినిమాలు వరుసగా విసుగు తెప్పిస్తున్నాయి. అందుకే దర్భార్‌పైన క్రేజ్ లేదు.
మహేష్ “సరిలేరు నీకెవ్వరు”లో విజయశాంతి ఫ్లస్ పాయింట్. అనిల్ రావిపూడి F2 తో మంచి క్రేజ్ మీద ఉన్నాడు. అయితే పాటలు వీక్‌గా ఉన్నాయి. కథ కూడా సులభంగా Guess చేయొచ్చు. మిలటరీలో ఉన్న మహేష్ కర్నూల్ వచ్చి విజయశాంతి సమస్యలను పరిష్కరిస్తాడు. దీనికి తగినట్టు ఫైట్స్, కామెడీ ఉంటాయి. F2లో కూడా సెకెండాఫ్ వీక్. వెంకటేష్‌తో ఎలాగో లాగేశాడు కానీ, పరమ చద్ది కంపు కొట్టే క్లైమాక్స్‌ని అనిల్ ప్లాన్ చేశాడు.
“సరిలేరు” కూడా మూస తరహాలో ఉంటే ఇబ్బందే. కథలో విషయం లేకపోతే విజయశాంతి, ప్రకాశ్‌రాజ్ కూడా కాపాడలేరు. అరగంట ట్రైన్ సీన్ పండితే OK, లేకపోతే కష్టమే. ఎందుకంటే ట్రైన్ కామెడీ బోలెడు సినిమాల్లో వాడేశారు. కొత్తగా చేస్తేనే Workout అవుతుంది.
ఇక బన్నీ “అల వైకుంఠపురం”లో సినిమాకి పాజిటివ్ బజ్ ఉంది. పాటలు ఇప్పటికే హిట్. పాత సినిమాలు కన్న కొడుకు, దేవుడు చేసిన మనుషులు జానర్‌లో ఉందనే అనుమానం. సొంత ఇంట్లోనే నౌకరుగా ఉండడం, మంచి ఎమోషనల్ పాయింటే. త్రివిక్రమ్ డైలాగ్స్‌తో ఏదో మ్యాజిక్ చేస్తాడు.
అయితే ఒక ఇంట్లోకి హీరో ప్రవేశించి , ఆ ఇంటిని బాగు చేయడం ఇది వందల సినిమాల్లో వచ్చేసింది. కొత్తగా ఏం చెప్పారు, ఎలా తీశారు అనేదానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
ఇక కల్యాణ్‌రామ్. “ఎంత మంచివాడివి రా” పై ఎవరికి ఏ అంచనాలు లేవు. శ్రీనివాస కల్యాణం అనే పెళ్లి డాక్యుమెంటరీ చేసిన తర్వాత డైరెక్టర్ వేగేశ్న సతీష్ గ్రాఫ్ పడిపోయింది.
పండగ కాబట్టి అన్నిటికి Openings వస్తాయి. వీకెండ్‌లో ఏది నిలబడుతుందో అదే హిట్.