iDreamPost
android-app
ios-app

కోకా 2.0 – లైగర్ సినిమా పాటలో “పూరి” స్పెషల్ రోల్..!!

కోకా 2.0 – లైగర్ సినిమా పాటలో “పూరి” స్పెషల్ రోల్..!!

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా లైగర్ ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తున్నాడు. ఒక సాంగ్ తరువాత మరొకటి విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. తాజాగా లైగర్ నుంచి మూడో పాట బయటకొచ్చింది.

‘కోకా 2.0..’ పేరుతో విడుదలైన ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. శుక్రవారం విడుదలైన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా, రామ్ మిరియాల – గీతా మాధురి కలిసి పాడారు. ఈ పాటలో విజయ్ తో పాటు తళుక్కున మెరిసాడు దర్శకుడు పూరి జగన్నాథ్. పంజాబీ స్టైల్ తో పాటు బీట్ ను మిక్స్ చేసి కంపోజ్ చేసిన ఈ పాటలో విజయ్ డ్యాన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, కరణ్ జోహార్ లు కలిసి నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. కాగా లైగర్ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet